Wednesday, 24 August 2016

సింధు పేరెంట్స్ ని చూసి అయినా చిత్తం మార్చుకొని "పురం నాగమణి "

                             రియో ఒలంపిక్స్ 2016 లో అమ్మాయిలే భారత జాతి పరువు కాపాడారు అని జాతి యావత్తు కీర్తిస్తున్న వేళ, ఆ సందర్భంగా మొన్న సోమ వారం , ఒలంపిక్స్ విజేత  P.V.  సింధుకు హైదరాబాద్లో తెలుగు రాష్ట్రాల మంత్రులు , అధికారులు ,ప్రధానమంత్రి గారికి స్వాగతం పలికిన చందంగా ఘనస్వాగతం పలికి , భారీ ఊరేగింపుతో ఊరేగించి , బోల్డన్ని నజరానాలు ఇస్తే , తమ కూతురు అయినందుకు ఆమె తల్లి తంద్రులు ఎంతో గర్వంగా పీలయ్యారు. దేశం లో చాలా మంది ఆడపిల్లలు ఉన్న తల్లి తండ్రులు సిందూ లాగా తమ కూతుళ్ళు  పేరు తెచ్చుకోవాలని అభిలషించి ఉంటారు. అసలు ఆడబిడ్డలే లేని వారు తమకు ఆ బాగ్యంలేకపోయిందే అని బాదపడిన వారూ ఉండవచ్చు . కాని నిజమాబాద్ జిల్లా, బీర్కూరు మండలం, దుర్కి గ్రామమ్ కి చెందిన పురం నాగమణి అనే పుత్రికల తల్లి మాత్రం అలా అనుకోలేక పోయింది. అందుకే సిందుకి సన్మానం జరిగిన తెల్లారే ఆమె అంత దారుణానికి ఒడిగట్టింది.

               ఈ రోజు ఈనాడు పేపర్లో ప్రచురితమైన వార్త ప్రకారం , నిజమాబాద్ లోని దుర్కి గ్రామానికి చెందిన పురం అశోక్ ,నాగమణిలకు మూడెల్ల క్రితం పెండ్లి అయింది. వారికి మొదటి సంతానంగా కూతురు పుడితే తేజశ్రీ అని పేరు పెట్టారు. రెండ కాన్పులో మగపిల్లాడు పుట్టాలని నాగమణి కోరుకుంది అట. కాని ఆమె కోరిన విదంగా కాక ఆమెకు రెండవ సంతానం కూడా ఆడపిల్లే కలిగింది అట. ఆమె ప్రసవింహి ౨౬ రోజులే అయినది. కని తనకు మగపిల్లాడు పుట్టలేదె అని మనోవ్యద చెంది నిన్న మంగళవరం తన ఒంటి మీద, తన పిల్లల ఒంటి మీద కిరోసిన్ పోసి నిప్పు అంటించుకుని దారుణంగా చనిపోయింది. ఆ మంటల్లో ఆమె ఆడపిల్లలు మాంసపు ముద్దలుగా మరిపోతే చూసే వారికి గుండె తరుక్కు పోయి ఉంతుంది.

   వంశాన్ని నిలబెట్టడానికి కొడుకు కావాలనేది పాతమాట. కాలం చెల్లిన మాట. పుట్టబోయే శిశువు లింగ నిర్దారణ చేసేది తల్లిలోని క్రోమోజోములు కావు, తండ్రి లోని క్రోముజోములే అని ఆధునిక వైద్యశాస్త్రం స్పష్టం చేసాక ఆడపిల్లా, మగపిల్లాడు అని వారసుల మద్య బేదాభిప్రాయాలు చూపడం తండ్రి తరపు వారికి తగని మాట. ఇక ఆడపిల్ల పుట్టినప్పుడు తనుస్త్రీగా తల్లి గర్వపడాలే కాని , తనజాతి శిశువును చూసి తనే వాపోవడమ్, వాళ్ళని చంపి తను చావడమ్ అనేది స్త్రీ జాతికి మాయని మచ్చను తెచ్చే పని. ఒక వేళా తను ఆడపిల్లకు  జన్మను ఇచ్చను అని భర్త కని, అత్తింతివారు తరపు వారు ఎవరైనా ఈసడిస్తుంటె, వారిని గల్లాలు పట్టుకుని తీసుకు వెళ్ళి డాక్టర్లతో , ఆడపిల్లల పుట్టుక నిర్దారణకు కారణమెవరో తెలియచేసే క్లాసులు ఇప్పించండి. అంతే కాని ఆడపిల్లలను చంపి వారి ఉసురు కొట్టుకోకండి .

                                                                       

                      మానవ  జాతిని కనే బాగ్యం దేవుడు స్త్రీలకు ఇచ్చినప్పటికి, స్త్రీ పురుషుల లింగ నిర్దారన చేసే అవకాశమ్ మాత్రం పురుషులదే .  ఏ పిల్లలు పుట్టాలి అన్నది మగవాడు నిర్ణయించలేనప్పటికి, వారి లింగ నిర్దారణకు తనలోని క్రోమో జోములే కారణమవుతున్నందున , ఆదపిల్ల పుట్టినా , మగపిల్లాడు పుట్టినా వారి లింగ నిర్దారణకు   100% బాధ్యత తనదే .ఒక వేళ ఆడపిల్లలు పుట్టడం అరిష్టం అని ఏ మూర్కుడు అయినా భావిస్తే అందుకు 100% బాధ్యత వహించాలసింది కూడా తానే. ఈ  విషయం లో  స్త్రీ నిమిత్త మాత్రురాలు. ఇక ఆడపిల్ల అయినా , మగపిల్లాడు అయినా 100% తండ్రికి వారసులే . అందువలననే ఆడపిల్లలకు కూడా కుటుంబ ఆస్తులు, బాద్యతలులో సమాన వాటాలు కల్పించింది. ఆదపిల్లలును చూసి కుంచించుకు పోయే తల్లితంద్రులు సిందు పెరెంట్స్ ను చూసి అయినా చిత్తం మార్చుకోండి.ఎందుకంటె వారు కూడ ఇద్దరు ఆడపిల్లల్ని కని వారి వలన అంతర్జాతీయ ఖ్యాతి పొందారు.

                ఎవరెన్ని చెప్పినా మా పద్దతి మార్చుకోము అనే మూర్కులు చివరకు నాగమణి లాగే అవుతారు. కాకపొతే బాధా కరమైన విషయం ఏమిటంటే ఈ ముర్కుల కడుపునా పుట్టిన నేరానికి ఎంతో మంది ఆడపిల్లలు అన్యాయంగా బలి అవుతున్నారు. వారి ఉసురుతో భరత భూమి అల్లడి తల్లడి అవుతుంది.

              

Tuesday, 23 August 2016

గోపిచంద్ గారు లాంటి గురువులు ఉన్నంత కాలము, P.V. సిందూ లాంటి క్రీడా తారలు మిల మిల మెరుస్తూనే ఉంటారు!!!


             అటు ప్రభుత్వ దన్ను , ఇటు గురువు ఆశీర్వచనం ఉంటే ఇటువంటి పతకాలు ఎన్నో !!.

                                              ఈ దేశం లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో స్కానింగ్ ల ద్వారా ఆడ  శిశువుల  ఆచూకీ కనుక్కుని వారిని హతమార్చే దుష్ట సంస్కృతీ ఉంది. దీనికి తండ్రులది ఎంత పాపపు బాధ్యతో అంతకంటే ఎక్కువ బాధ్యత తల్లులది . అదిగో అలాంటి పాపపు తల్లి తండ్రులను వరుసగా నిలబెట్టి , మొన్న ఒలంపిక్స్ లో విజయం సాధించిన భారత క్రీడాకారిణులు ఇద్దరు సింధు మరియు సాక్షి మాలిక్   ల కాలి చెప్పులతో సత్కారం చేస్తే కానీ వారికి బుద్ధి  రాదు. మన రాష్ట్రం మరియు హరియానాకు చెందిన ఆ ఇద్దరు ఆడ  పిల్లలు  ఒకరు రజతం , మరొకరు కాంస్య పతాకం సాధించినందు వలననే అంతర్జాతియ ఒలంపిక్స్ క్రీడా మైదానం లో మన దేశం యొక్క జాతీయ గీతం ఆలకించే  భాగ్యం దక్కింది. 125 కోట్లమంది ప్రజలు ఉన్న ఒక దేశం రియో  ఒలంపిక్స్ 2016 లో కనీసం ఒక స్వర్ణం  వచ్చినా బాగుండు అనే దౌర్భాగ్యపు పరిస్థితికి నెట్టబడింది అంటే దానికి ఎవరు కారణం ?

                                                                     
సింధు ఎత్తింది అమ్మోరి బోనం మాత్రమే కాదు ,రెండు  తెలుగు రాష్ట్రాల కీర్తి పతాకాలు కూడా                          మన దేశం  జనాభా పరంగా గొప్పదేశం . 125 కోట్లమందిమి మేము అని ఘనంగా ఎలుగెత్తి  చాటుకుంటాం. కానీ అంతర్జాతీయ క్రీడా పోటీల వేదిక  అయిన ఒలంపిక్స్ క్రీడల విషయం వరకు వచ్చే సరికి కనీసం లక్షల జనాభా ఉన్న దేశాలు సాధించిన పతకాలు కూడా మనం సాధించలేని పరిస్థితి. ఎందుకయ్యా ఈ  దౌర్బాగ్యం  అంటే అడగల సత్తా ఉన్నా పిల్లలు మనకున్న్నా వారికి తగినంత ప్రోత్సాహం ఇచ్చే రాజకీయ రహిత ప్రభుత్వాలు కానీ , నైపుణ్యత గల గురువులు కానీ లేకపోవడమే అని నా అభిప్రాయం.


                      వజ్రం గనిలో  ఉన్నంత సేపు వాటికి ఉండే విలువ తక్కువ. కానీ ఒక సారి అదే వజ్రాన్ని జాగ్రత్తగా సానపెట్టి మార్కెట్లో పెడితే వాటి విలువ కోట్లలో కూడా ఉండవచ్చు .  అదే కోట్ల విలువ చేసే వజ్రాన్ని సైతం సానపెట్టడం లో నైపుణ్యం లేని వారి చేత సానపెట్టిస్తే అది పాడయి  దాని విలువ జీరో కూడా అయ్యే ప్రమాదముంది. అంటే ఒక వజ్రపురాయి  విలువ ఇనుమడించాలి అంటే అందుకు సరి అయినా నై పుణ్యం కల  సానపెట్టే నేర్పరి కావాలి . ఇదే సూత్రం అంతర్జాతీయ క్రీడాకారులకు, వారి శిక్షణ ఇచ్చే కోచ్ లకు కూడా వర్తిస్తుంది.
                                                                     
                                ఆడబిడ్డయితే ఏమి ? కన్నవారి మోముల్లో నవ్వులు పూయించిన బంగారు తల్లి
   
                   హైదరాబాద్ కు చెందిన "పుల్లెల గోపిచంద్ బాడ్మింటన్ అకాడెమి " వ్యస్థాపకులు అయిన గోపిచంద్ గారి కృషివలననే హైదరాబాద్ కు చెందిన నేటి ఒలంపిక్స్  రజత పతక విజేతగా  సింధు విజయం సాధించగలిగింది . సింధు లో ప్రతిభ ఉంది . కానీ నైపుణ్యం కలిగిన కోచ్ లేకుంటే ఎంత గొప్ప క్రీడాకారుడైనా అంతర్జాతీయ క్రీడా మైదానాలలో నిలబడటం కష్టం . ఇదే విషయాన్ని స్వయంగా గోపిచంద్ గారే చెప్పారు. తనకు సరి అయినా కోచ్ సహకారం లేనందువలనే 2000 సిడ్నీ ఒలంపిక్స్ లో విజయం సాధించలేక పోయాను అని అన్నారు . అందుకే  ఎన్నో కష్ట నష్టాలకోర్చి ప్రభుత్వం ఇచ్చిన 5 ఎకరాల భూమిలో తన పేరుమీదే బాడ్మింటన్  ఎకాడెమి  పెట్టి ఎంతో మంది జాతీయ , అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారుచేసారు . వారందరిలో మేటి నిన్నటి ఒలంపిక్స్ విజేత , తెలుగుబిడ్డ సింధు. పతకం కోసం ముఖం వాచిపోయి చూస్తున్న తరుణం లో రజతం సాధించిన సింధును , ఆమెకు తర్పీదు ఇచ్చిన పుల్లెల గోపిచంద్ ను ఎన్ని రకాలుగా సత్కరించినా , కొనియాడిన తక్కువే. అందుకే నిన్న తెలంగాణా ప్రభుత్వం , నేడు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం  భారీగా సత్కారాలు చేస్తోంది.

                                                                       
                                                    125 కోట్ల మంది పరువు నిలిపిన  సాక్షి మాలిక్ .
 
                           ఇప్పటికైనా భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరచి, ప్రజలకు ,క్రీడాకారులకు క్రికెట్ మీద ఉన్న మోజు తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలి. పిల్లలకు స్కూల్ స్థాయి నుంచే అత్యుతమ శిక్షణ అన్ని క్రీడలలో అందేలా చూడాలి. ప్రతి జిల్లాలో ,రాష్ట్రం లో అత్యుత్తమ సౌకర్యాలు , కోచ్ లు కలిగిన సర్వ క్రీడా ఎకాడెమీలు ఏర్పాటు చేయాలి . క్రీడాకారుల కోటను విద్యా , ఉద్యోగ రంగాల్లో పెంచాలి. మనం దేశ జనాభాలోనే కాదు , క్రీడా సామర్థ్యం లోను ప్రపంచ స్థాయి లో ఏ మాత్రం తక్కువ కామని నిరూపించుకోవాలి.

  రియో   ఒలంపిక్స్ 2016 లో రజత, కాంస్య పతక విజేతలు అయిన భారత సివంగులు  P.V సింధు మరియు సాక్షి మాలిక్ లకు శుభాభినందనలు , వారిని కన్న తల్లితండ్రులకు, క్రీడా విద్యనేర్పిన గురువులకు అనంతకోటి నమస్కారాలు .

         

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

                                       ప్రపంచం లో వెల్లివిరుస్తున్న  మై చాయిస్ కల్చర్ లో భాగం అయినటువంటి "సింగిల్ పేరెంట్ " సిస్టం ఇండియాలో  కూడా వ్యాప్తి చెందుతుంది అనడానికి  ఉదాహరణ  నటుడు తుషార్ కపూర్ తండ్రి అయిన  విధానం . సింగిల్ పేరెంట్ విధానం అంటే పుట్టిన పిల్ల లేక పిల్లవాడికి  తల్లితండ్రులు ఉండరు. తల్లి లేక తండ్రి మాత్రమే ఉంటారు. ఇదెలా అంటే పెండ్లి అంటే ఇష్టం లేని వారు, అపోజిట్ సెక్స్ మీద ఇంట్రస్ట్ లేనివారు , లెస్బియన్, గే సంబంధాలు పట్ల అనురక్తి కలవారు , తమలో సహజంగా కలిగే సంతాన వాంఛా , తద్వారా వంశాభివృద్ధి చేసుకోవాలనే కోరికను నెరవేర్చుకోవడానికి , ఆధునిక వైద్య శాస్త్రం అందించే సర్రోగసి లాంటి విధానాలు ను పాటించి  తల్లి లేక తండ్రిగా తమ పిల్లలను ఈ భూమి మీదకు తీసుకువస్తున్నారు. అలా సర్రోగసి విధానం ద్వారానే తనకు కొడుకు పుట్టాడని సంతోషంగా ట్విట్టర్ లో ప్రకటించాడు నటుడు నిర్మాత అయినా తుషార్ కపూర్ అనే బాలీవుడ్ నటుడు.

  థి డర్టీ పిక్చర్ నిర్మాత అయినా శ్రీ తుషార్ కపూర్ ప్రముఖ బాలీవుడ్ నటుడు జీతెంద్ర , శోభా కపూర్ ల కుమారుడు. నిర్మాత ఏక్తా కపూర్ కు స్వయానా సోదరుడు . మరి మీకు   సింగిల్ పేరెంట్ గా కొడుకును పొందాలని ఎందుకు అనిపించింది  అంటే ఆయన చెప్పిన విషయం ఏమిటో తెలుసా?  ఆయన ఒక సారి ప్లయిట్ లో దర్శకుడు ప్రకాష్ జా తో కలసి ప్రయాణం చేస్తుంటే , ఆ దర్శకుడే ఈ సింగిల్ పేరెంట్ మరియు సర్రోగసి విధానం గురించి చెప్పాడు ఆట. అంటే కాదు తానే దగ్గరుండి సర్రోగసి కి సహకరించే కుటుంబాన్ని పరిచయం చేయడమే కాక , పిండప్రవేశం  మొదలు  కొడుకు పుట్టే దాకా అన్నీ  దగ్గరుండి చూశాడట. చివరకు కొడుకు పుడితే  "లక్ష్య " అనే నామకరణం కూడా ప్రకాష్ జా గారే చేసినట్లు0ది.

     సరే , ఏదో సినిమాకి అంటే డైరెక్షన్ చేయడం లో అర్థం ఉంది కానీ, ఇలా తుషార్ కపూర్ గారిని సింగిల్ పేరెంట్ గా మార్చడం లో ఆయనకు ఉన్న ఇంట్రెస్ట్ ఏమిటో అర్థం కావడం లేదు. బహుశా తుషార్ కపూర్ అందరిలా పెండ్లి చేసుకుని పిల్లలు కనడం ప్రకాష్ జా గారికి ఇష్టం లేదేమో? వారిద్దరి మధ్య చెక్కు చెదరని దృఢమైన సంబంధం ఎధొ ఉండబట్టే ఇలా తుషారకపూర్ ఆయన గారి దర్శకత్వం లో ఇలా  " అలీ లేని అబ్బ కి అమ్మ లేని బాబు" అనే ఎపిసోడ్ లో నటించి విజయవంతంగా "లక్ష్యా "న్ని సాధించాడు. దీనికి జీతెంద్ర కపూర్ ప్యామిలీ బహుత్ ఖుషి  ఆట.ఈ సింగిల్ పేరెంట్ సాధించిన ఘన విజయానికి అందరూ కాంగ్రేట్స్ అంటున్నారట.

    మరి అంతా బాగానే ఉంది కానీ , రేపు లక్ష్య పెరిగి పెద్దవాడై అందరికి మల్లె తాను పొందాల్సిన మాతృత్వపు ప్రేమకు నన్ను  ఎందుకు దూరం చేసావు డాడీ అంటే ఈ సింగిల్ పేరెంట్ ఏమి జవాబు చెపుతాడు? ఈ  ప్రపంచం లో సింగిల్ పేరెంట్ లకేనా హక్కులు? వారికి పుట్టే బిడ్డలకు ఉండే సహజ హక్కుల మాటేమిటి? మానవ  సమాజానికి , జంతు సమాజానికి ఉండే గీతలు చెరిపేస్తున్న ఈ  "మై చాయిస్ " వాదులకు , పిల్లలకు ఉండే పేరెంట్స్ ప్రేమ ను పొందే హక్కును కాల రాసే అధికారం ఎవరు  ఇచ్చారు?  చట్టాలు చేసే చట్ట నిర్మాతలు ఆలోచన చేయాలి. ఇటువంటి విపరీతపుపోకడలను నిషేదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

      పిల్లలకు తల్లితండ్రుల ప్రేమను పొందడం అనేది జన్మ హక్కు. దానిని పుట్టకతోనే కాలరాస్తున్న ఈ ఆధునిక రాక్షస సంస్కృతిని ఇండియాలో నిషేదించాలి. లేకుంటే జంతువులకు మనకు తేడా ఏముంది?

        గమనిక: ఈ  పోస్ట్  కి వచ్చిన కామెంట్ లు అన్ని ఓపికతో చూడగలరని మనవి. 

Monday, 22 August 2016

మొగుళ్ళని "విగత" లుగాను, పెళ్ళాల్ని "విదవలు " గా ను చేస్తున్న ఈ చట్టం మన సమాజానికి సరిఅయినదేనా?

                                                                                                                           


                      ప్రభుత్వాలు ఎంత గొప్ప చట్టాలు చేసాయి  అనేది కాదు , ప్రజలు దానిని ఎంత సక్రమంగా వినియోగొంచుకుంటున్నారు అనే దాని  మీదే  ఆ చట్టం యొక్క కొనసాగింపు ఆదారపడి ఉంటుంది . ప్రజలు స్వీకరించని చట్టాలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. కానీ ప్రజలు 95% దుర్వినియోగ పరచడం వలన, వ్యక్తులు  హింసించబడడమే  కాక ఆత్మహత్యలకు గురికాబడుతున్నపుడు , ఆ చట్టాలు మాత్రం ఎట్టి పరిస్తితుల్లోను కోన సాగించడానికి వీలు లేదు. ఏ  నేర చట్టం ఉద్దేశ్యమైన  ప్రజలలో మార్పు తేవడమే తప్పా , మట్టు బెట్టడానికి కాదు. ఒక వేళా నేరస్తుణ్ణి చంపాలన్నా అదీ కూడా  చట్టబద్ద విదానాల ద్వారానే జరగాలి తప్పా , చట్ట వేదింపులు గురి అయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్తితుల్లో కాదు. అలా 95% దుర్వినియోగ మవుతూ భారతీయ భర్తల ఆత్మహత్యలకు కారణ మవుతున్న 498-A  నేరస్మ్రుతి నిబందన పై తక్షణం సమీక్ష జరిపి సవరించాల్సిన అవసరం  ఉంది.

  భారత దేశానికి ఉన్న విశిష్టతల్లో బలమైన కుటుంభ వ్యవస్థ కూడా  ఒకటి . స్త్రీ పురుషుల మద్య ఆరోగ్యకరమైన సంబందాలే కాక, పిల్లలను సమాజానికి ఉపయోగ పడే , పరిపూర్ణమైన వ్యక్తులుగా తీర్చి దిద్దడానికి "కుటుంభం " అనేదే మొదటి పాఠ శాల , తల్లి తండ్రులే తోలి గురువులు అవుతారు. ఒక పాఠ శాలలో గురువుల మద్య సమస్యలు వస్తే , ఆ పాఠశాల యొక్క బవిష్యత్తు ను ద్రుష్టిలో పెట్టుకునే వారి మద్య సమస్యలు తీర్చడానికి పెద్దలు లేక అధికారులు ప్రయత్ణిస్తారు. కానీ అదేమి దౌర్బాగ్యమో  కానీ అదే కుటుంభం లోని భార్యా భర్తల మద్య సమస్యలు వస్తే మాత్రం కుటుంభ సంక్షేమం కంటే వ్యక్తీ సంక్షేమమే ముఖ్యమనే దోరణిలో వ్యవహరిస్తున్నారు. ఒక విద్యా సంస్తలో పని చేసే  ఉపాద్యాయురాలీని హెడ్ మాస్టర్ వేదింపులకు గురిచేస్తే దానిని హెడ్మాస్టర్ హింసిస్తున్నాడు అని మాత్రమే వ్యవహరిస్తారు. అంతే కానీ అది "విద్యాసంస్త హింస" గా పరిగణించరు . కానీ అదే కుటుంబం వరకు వచ్చే సరికి వ్యక్తుల మద్య హింసను కూడా "గృహ హింస" గా పరిగణిస్తూ మొత్తం కుటుంభానినే శిక్షిస్తున్నారు.
  ఈ  దేశం లో స్త్రీలకు రక్షణ లేదు అనే ఒకే ఒక నినాదంతో  ఇంటిని, వీదిని  చట్ట సవరణలతో ఒకే గాటన కట్టి పడేశారు . చెప్పుకుంటే సిగ్గు చేటు కానీ "నిర్భయ " కంటే భయంకరమైనది  498-A  చట్టం . నిర్భయలో మ్రుగాడు జైలులో అన్నా బ్రతుకుతాడు. కానీ గృహ హింస నిందితుడు అయినా మగాడు నరకయాతన అనుభవించి , చివరకు ఆత్మహత్య చేసుకుంటున్నాడట! ఇది నేను చెప్పే మాట కాదు సాక్షాతూ నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో వారు లెక్కలు పరిశిఌంచి చెప్పిన మాట. 2012 లెక్కల ప్రకారం వివాహం అయిన పురుషులు గృహ సంబంద సమస్యలు వలన చనిపోయినవారు 63,343 మంది కాగా స్త్రీలు 31,921 గా ఉందంట! అంతే బార్యలు కంటే భర్తల సంఖ్యే రెట్టింపుగా ఉంది. మరి ఈ  విదంగా చూస్తె గృహ హింస వలన స్త్రీల కంటే పురుషులే రెట్టింపు సంఖ్యలో బాదపడుతున్నారు కదా! దీనికి కారణాలు ఏమిటి?

      భారతీయ కుటుంబాలను నాశనం చేసే వాటిలో మొదటిది "వరకట్నం " కాగా , రెండవది "గృహ హింస " చట్టం. వరకట్నం కోసం ఆడపిల్లలను రాచి రంపాన పెట్టే భర్తల కన్నా , అత్తలు ఆడబిడ్డలు పాత్రే ఎక్కువ. అప్యాయతలు, అను రాగాలు అనే వాటికి అర్దం లేకుండా చేసింది వరకట్న వ్యవస్త. అటు ఎక్కువ కట్నం తెచ్చిన వారు కూడా  తాము అత్తింటి వారికి ఊడిగం చేయాల్సిన కర్మ ఏమిటి? అని పెళ్లినా ఆర్నెళ్ళకే ఎదో సమస్య సృష్టించుకుని , చిన్న సమస్యలను కూడా  బూతద్దాలలో  చూపిస్తూ వేరు కాపురం కోసం కీచులాట పెడుతుంటారు. ఇది సహజంగానే ఆ కుటుంబంలో ని సబ్యుల మద్య శాశ్వత వైరాలు కలిగిస్తుంటాయి. అలాగే భార్య భర్తల మద్య గొడవలు వస్తే వాటిని పరిష్కరించడానికి అటు భార్య తరపు వారు కానీ, ఇటు భర్త తరపు వారు కానీ కుటుంభ సంక్షేమం ద్రుష్టిలో ఉంచుకుని కౌన్సిలింగ్ చేస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతయి. కానీ బార్య తరపున ఎవరైనా రాజకీయ నాయకులూ ఉంటే మాత్రం ఇక ఆ సమస్య పొలిసు కేసులు దాకా వెళ్ళటం , కేవలం భర్త మీద కేసు పెడితే భర్త తొందరగా దారికి రాడు కాబట్టి , ఎప్పుడో విడిపోయి వెళ్లి పోయిన అతని తరపు అన్నదమ్ములతో సహా ఆత్త మామల మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ఆ కేసులు ఎలాగు తొందరగా తేలవు కాబట్టి, సమస్య చిన్నదైనా పెద్దదైనా "గృహ హింస" మాత్రం ఒకటే మోతాదులో ఉంటుంది కాబట్టి, అటు పెళ్ళానికి, ఇటు పిల్లలకు దూరమై, తన వలన తన కుటుంభం యావత్తు బాధపడడం తట్టుకోలేక చివరకు ఆత్మహత్య చేసుకుంటున్నారు.

    నేను ఇదంతా చెపుతుంది కుటుంబాలలో స్త్రీలు ఎక్కువుగా ఆనందంగా ఉంటున్నారని పురుషులు మాత్రమే బాదపడుతున్నారని కాదు. స్త్రీల బాదల పట్ల స్పందించినంతగా పురుషుల పట్ల అటు సమాజం కానీ , ఇటు చట్టాలు కానీ స్పందించవు. పురుషుడు పెట్టే హింస పైకి కనపడుతుంది కాబట్టి స్త్రీలు దానిని చూపించి జాలీ, సాను భూతి పొందగలుగుతున్నారు. అదే పురుషులను స్త్రీలు పెట్టే హింస పైకి కనపడదు. ఉదాహరణకు భర్తను రోజూ తిట్లతో లేక సనుగుడుతో సతాయించే  పోరును తట్టుకోలేక ఒక దెబ్బ కొడితే , ఆ కొట్టిన దెబ్బ కనపడుతుంది కానీ వారం రోజులుగా సనుగుడుతో సతాయించిన స్త్రీ వేదింపు ఎవరిక్ కనపడుతుంది? స్త్రీలు బోరున ఏడ్చి తమలో ఏ మాత్రం స్ట్రెస్ లేకుండా చేసుకోగలుగుతారు. కానీ ఈ  పురుష అహంకార సమాజం మగవాడిని ఏద్వనీయకుండా చేస్తుంది. దీని వలన మరింత స్ట్రెస్ కు గురి అయి ఆ కోపం భార్యా పిల్లల మీద చూపించే సరికి అది గృహ హింస గా వికృత రూపం దాల్చి , చివరకు అతని ప్రాణాలను తీస్తుంది. కాబట్టి  పురుషా అహంకార సమాజం లో స్త్రీలే కాదు , పురుషులు కూడా  బాదితులే! ఏడ్చే స్వాతంత్ర్యం లేని సమాజంలో పురుషుడు ఉండలేక పోతున్నాడు.

    కాబట్టి కుటుంబ సమస్యలను కుటుంభ సంక్షేమం దృష్టితోనే చూడాలి అందులోని సబ్యుల వ్యక్తిగత సంక్షేమం దృష్ట్యా కాదూ . ఒక వేలా భార్యా భర్తలు కలస్ది ఉండలేని పరిస్తితులు దాపురిస్తే అప్పుడు మత్రమే బాద్యులను శిక్షించి బాదితులకు విడాకులు సహితంగా అన్నీ పరిహారాలు లభించేలా చేయాలి. లేదంటే ఇంగ్లాండ్ మాదిరి ఇండియాలో కూడా  వివ్వాహ రహిత కుటుంబాలు ఉంటాయి.కాకుంటే స్త్రీలు బాదపడుతున్నారు కాబట్టి వారికోసం ఒక రోజును కేటాయించినట్లు , బాదిత పురుషుల కోసం కూడా  ఒక దినం కేటాయించారు . అదే "అంతర్జాతీయ పురుషుల దినం". ఇలా దినాలు కేటాయించడం తప్పా మనమేమి చేయాలేమా? ఆలోచించండి.
                                                      (20/11/2013 Post Republished)

Sunday, 21 August 2016

5 గురు కలసి అమ్మాయిని "గాంగ్ రేప్ " చేసిన వాళ్ళు "భాయ్ ప్రెండ్లు " అవుతారా?

                                                               
 


                                                            వేయి గంగా నదులు నీరు తెచ్చి కడిగినా ప్రస్తుత భారతీయ సమాజం లోని మలినం తొలగిపోయేలా లేదు. ఈ  సమాజాన్ని మతిమాలిన స్వేచ్చా విదానాలు, కట్టుబాట్లు లేని పిల్లల పెంపకాలు, బ్రష్టు పట్టి పోతున్న కుటుంబ సంబందాలు అన్నీ, అన్నీ కూడి  సర్వ నాశనం చేస్తున్నాయి. పట్టుమని పదిహేనేళ్ళు దాటని మగ పిల్లలు ఆడపిల్లలను గాంగ్ రేప్ లు చేసే హీన స్తాయిలో ఈ  సమాజం ఉందంటే, దానికి కారణO  ఎవరు? ఇప్పుడు సమాజం లో ఏమి జరుగుతుందో తెలియక ఎప్పుడో సమాజం లో ఉన్న దురాచారాలు , వాటికి కారకులైన పూర్వికులను నిరంతరం తిడుతూ , సమాజం లో మరింత విశ్రుంఖల మైన స్వేఛా  బావ  వ్యాప్తికి కారకులవుతున్న ఆదునిక వాదులా ? , పరిస్తితులకు అనుగుణంగా సంస్కరణలు చేపట్టి సమాజాన్ని మార్చుకునే ప్రయత్నం చేయకుండా , ఎప్పుడో తమ తాతలు చెప్పిన దానినే వల్లెవేస్తూ, పరమ చాందసంగా ప్రజలు త్రుణికరించే బావాలను ఇంకా సజీవంగా ఉంచాలనుకునే చాందస వాదులా? నన్నడిగితే అటు ఆదునిక వాదులు, ఇటు చాందస వాదులు ఇరువురూ ఈ  సమాజాన్నిఎంతవరకు దిగజారా లో అంతవరకు దిగజరేలా చేస్తునారు .

  ఒక సమాజం లో సంస్కరణలు  అనేవి  ప్రజలకు  మంచి చేయడానికే  రూపొందించబడతయి. కానీ అవే సంస్కరణలు కాలాంతరంలో ప్రజలకు ఉపయోగపడక పోగా చెడు చేసే విదంగా మారి పోవచ్చు. మరి అటువంటప్పుడు పాత  సంస్కరణలను సమీక్షించి  ప్రస్తుత పరిస్తితులకు అనుగుణంగా వాటిని మార్చాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు కొంచం ఈడు వచ్చిన ఆడపిల్లలను తన తోటి మగపిల్లలతో కలసి తిరగడ్డాన్నీ తప్పు పట్టేవారు పెద్దలు. అది స్త్రీ  స్వేచ్చా వికాసానికి పనికి రాని సాంప్రదాయం అని కో ఎడుకేషన్ పద్దతిని ప్రోస్తాహించి ఆడపిల్లల , మగపిల్లల మద్య స్నేహాలను ఆమోదించారు. కానీ ఈ  ఆడ మగ స్నేహాలు విదేశాలలో సక్సెస్ అయితే అయి ఉండవచ్చు కానీ, ఈ  సమాజం లో మాత్రం  స్త్రీల రక్షణకు పెను సవాలుగా మారిపోతున్నాయి. కొన్ని ఉదాహరణలు చెపుతాను.

       ఈ  మద్యనే ఖమ్మం దగ్గర పల్లెటూర్లో ఒక 5 యేండ్ల పాపను ఆదుకుందాం రా  అని చెప్పి, పక్కింటి 13 ఏండ్ల కుర్రాడు రేప్ చేసాడు. దానికి ఆ పాప ఆరోగ్య పరిస్తితి అందోలనగా మారింది. ఇలా మన రాష్ట్రం లో అనేకం జరిగాయి.  ఇది ఒక్క మన రాష్ట్రం అనే కాదు దేశ వ్యాప్తంగా ఈ  పిల్ల మృగాల్ల సంఖ్య అదికమవుతుంది. నిన్న ఆస్సాం లో ఒక 12 ఏండ్ల అమ్మాయిని బాయి ప్రెండ్ ఒకడు బయటకు ఆటల నెపంతో తీసుకు వెళ్లి అక్కడ ఇంకొక నలుగురుతో కలసి ఆ అమ్మాయిని గాంగ్ రేప్ కు గురి చేసారు. పాపం ఆ అమ్మాయి తనకు జరిగిన అమానుషాన్ని ఇంటికి వచ్చి తల్లి తో  చెపితే ఆమె పోలిస్ కంప్లైంట్ ఇచ్చింది. దానికి పోలిసులు వారిని పట్టుకుని అరెస్ట్ చేస్తే తాము మైనర్లమని క్లైం  చేసారట!  అంటే వారికి 3 యేండ్లకు మించి శిక్ష విదించే అవకాశం లేదు. రేప్ లు మాత్రం చేసేటప్పుడు మేజర్ల లాగే ప్రవర్తించినా , కేసులు వరకు వచ్చే సరికి మైనర్లు  గా చట్ట రక్షణ పొందుతున్నారు. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే ఆ అమ్మాయికి తండ్రి లేనట్లుంది. ఇది కూడా  ఆ పిల్ల మ్రుగాళ్ళకు అలుసుగా మారి ఉండవచ్చు. మరి ఇంత దారుణమైన విదంగా చిన్న పిల్లల స్తాయి నుంచే మగవాళ్ళు తమ "మగ బుద్దిని" ని ప్రదర్శిస్తుంటే వారి నుంచి ఆడపిల్లలను కాపాడటానికి కావల్సింది జాగర్తలతో లేక అంక్షల తో కూడిన కట్టుబాట్లా? లేక ఇంకా విశ్రుంకలత్వాన్ని ప్రోస్తాహించే పనికి మాలిన వాదాలా?

    నిజమే! స్త్రీ వాదులు అంటున్నట్లు ఈ  దేశం లో   మగవాడి బుద్ది  ఎదగలేదు అనే అనుకుందాం. మరి ఎదగని ఆ మగవాడి తో స్త్రీలు ఎంత జాగర్తగా ఉండాల్సిన అవసరం ఉంది? అలా జాగర్తలు తీసుకోవమని చెపితే అంతలా సాంప్రదాయక వాదులు మీద ఎగిరి పడడం ఎందుకు? ఇంగిత జ్ఞానం లేకుండా , స్వేచ్చా ఉందని చెప్పి నడిస్తే , ఆ తర్వాత జరిగే పరిణామాలకు నిందితులను మహా అయితే కఠినంగా శిక్షించడం తప్పా , చట్ట పరంగా ఎవరేమి చేయగలరు? మరి ఈ  కఠిన శిక్షలు మగవారిలో మార్పు తెస్తాయ? తెస్తే అది ఎంత కాలం పడుతుంది? అలా మార్పు వచ్చే దాక ఎంతమంది ఆడబిడ్డలు అన్యాయం కావాలి . కాబట్టి ఇది పనికి రాని  స్త్రీ వాదం. నా అభిప్రాయం ఏమిటంటే స్త్రీ రక్షణకు బలమైన కుటుంభ వ్యవస్త ఉండి తీరాలి. అటు స్త్రీలను, ఇటు పురుషులను సత్పౌరులుగా తీర్చిదిద్దడానికి, అంక్షలు తో , నిరంతర పర్యవేక్షణతో , క్రమశిక్షణతో మెలిగేలా చేయగలిగింది కుటుంబ వ్యవస్తే.రేప్ లకు గురి అవుతున్న స్త్రీలు మరియు మృగాల్ల కుటుంబ నేపద్యాలు పరిసీలిస్తే ఐ విషయం మనకు అవగతం అవుతుంది. . కానీ దానిని కూడా  సర్వ నాశనం చేస్తుంది సో కాల్డ్ ఆదునిక స్త్రీ వాదం.ఒక స్త్రీ వాది, మన సమాజంలో   పరాయి మగవాళ్ళు రేప్ ల కంటే కుటుంబంలో తండ్రులు , బాబాయిలు  లాంటి కుటుంబ సబ్యులు చేసే నీచ ప్రవర్తనలే ఎక్కువ అని భారతీయ కుటుంబ వ్యవస్తనే గేలి చేసింది . ఆమే పేరు షోమా ఆనంద్ .దీ గ్రేట్ తెహల్కాపత్రిక మేనేజింగ్ ఎడిటర్. ఆమె ఏమందో ఒక సారి  చూడండి .

" భారతదేశంలో ఇప్పటికే అత్యాచారాల సంఖ్యను తగ్గించి చెబుతున్నారు. దాని వెనుక కనీసం ఉందని కూడా అంగీకరించని ఒక ఇతర హింసా ప్రపంచమే దాగి ఉందని ఎవరు గుర్తించేది? కేవలం ఒక తెల్ల బస్సులోని హింసోన్మాదులే రేపిస్టులు కానవసరం లేదు: తండ్రులు, భర్తలు, సోదరులు, బాబాయిలు, స్నేహితులు వీరు కూడా. తమ సొంత ఇళ్లలోనే, నాలుగు గోడల మధ్య తమను అసహ్యంగా తాకిన, అభిమానాన్ని భంగపరిచిన, చెప్పలేని విధంగా వేధించిన, అత్యాచారానికి గురయిన కధ –చెప్పినవి, చెప్పనివీ- దాదాపు ప్రతి ఇద్దరిలోనూ ఒక స్త్రీకి ఉంటుంది. దాని గురించి వారు ధైర్యం చేసి చెప్పడం అంటూ జరిగితే, దాన్ని సమాధి చేసి భరించి ఊరుకొమ్మని చెప్పి నోరు మూయిస్తారు. స్త్రీ జీవితంలో అదొక భాగంగా మారిపోయింది. అంకుల్ తనను వేధిస్తున్నాడని ఒక మైనర్ బాలిక పేరు పెట్టి చెప్పడం అంటే అది కుటుంబాన్ని బజారుకి ఈడ్చడమే. ఇక వైవాహిక అత్యాచారాల సంగతి చెప్పుకోవాలంటే అది మన ఊహా శక్తిని దాటిపోతుంది. మహిళలకు సంబంధించి మన పశుత్వ భావనలు ఎంతదూరం వెళ్తాయంటే సమాజం చీదరించుకునే ఒంటరి బతుకుకంటే రేపిస్టును పెళ్లి చేసుకోవడమే ఉత్తమమైన విముక్తి మార్గం అని న్యాయమూర్తులే తరచుగా సలహా ఇస్తున్నారు."(జాతీయ , అంతర్జాతీయ వార్తలు , విశ్లేషణ బ్లాగు నుండి) . 

 ఈ విదమైన పనికి రాని  వాగుడు వాగి , ఇంట్లోని సబ్యులను వీది రౌడీలు కంటే అత్యంత జుగుప్సాకరంగా పోల్చి, కుటుంబం అనేది స్త్రీలకు పనికి రానిదని తేల్చి పారేసింది. మరి ఇదే మహిళ తన యజమాని అయిన తరుణ్ తేజ్ పాల్ తన తోటి ఉద్యోగినిపై లైంగిక వేదింపులకు పాల్పడితే , అతన్ని టెక్నికల్  గా రక్షించాలని చూస్తుంది . ఇలా ఉంటాయి స్త్రీవాదుల  స్వార్దాలు .

కాబట్టి  కుటుంభ వ్యవస్థ బల హీనమయితే మొదటి నష్టం స్త్రీలకే  అన్నది గుర్తుంచుకుని మెలగితే అందరికీ మంచిది.లేదు అనుకుంటే స్త్రీ వాది షోమా ఆనంద్ సెలవిచ్చినట్లు ఇతర శారీరక గాయాలు వలనే , రేప్ కూడా  ఒక శారీరక గాయం గా బావించాలి అనుకునే వారు , ఇండియాలో కాకుండా అండమాన్ నికోబార్ దీవులలో ఒక దీవిని చూసుకుని(అక్కడ వేయి దీవులు జన రహితంగా ఉన్నాయట) , కుటుంబ రహితంగా " హుక్కా పార్టీలు" మాదిరి , ఏ ఆంక్షలు లేని ఆనందకర జీవనం కొనసాగించవచ్చు. 

                                                           (27/11/2013 Post Republished).

  

ఆడవాళ్ళను గోకడం లో ఆంద్రా యే ఫస్ట్ అట!!?

                                                                     

                                        నిన్న ఈనాడు పత్రికలో తాటికాయంత అక్షరాలు కాకపోయినా , చదువరులను ఆకర్షించే అంత అక్షరాలతో "మహిళలను అవమానించడం లో మనమే ముందు" అనే శిర్షికతో ఒక వార్తను ప్రచురించారు. దాని పక్కనే చిన్న అక్షరాలతో "సిగ్గు, సిగ్గు" అని కూడా ఉంది. ఏంటబ్బా అని విషయం మొత్తం చదివితే ఆడవాళ్ళను గోకడం లో ఆంద్రా స్టేట్ మొదటి వరుసలో ఉంటె , అత్యాచారాల విషయం లో మాత్రం ఆ క్రెడిట్ మద్యప్రదేశ్ వాళ్ళు కొట్టేసారు.తెలుగు రాష్త్రాలుకి , మద్యప్రదేశ్ కి అత్యాచారాల  సంఖ్య విషయంలో చాలా తేడా ఉంది. ఈ  లెక్కలు ఎవరో చెప్పిన కాకి లెక్కలు కావు. సాక్షాత్తు మనదేశ జాతీయ నేరాల నమోదు సంస్థ వారు ప్రకటించినవి కాబట్టి నమ్మదగినవే . వారు 2014 సంవత్సరానికి గాను దేశం లో  జరిగిన రక రకాల వేదింపులు , నేరాలు కు సంబందించి ఒక చిట్టా విడుదల చేసారు . అదేమిటో క్రింద చూడండి.

                                                                   


                                            
                              పై చిట్టాను చూస్తే హత్యలు, అపహరణాలు విషయాల్లో అత్యదిక జనాబా ఉన్న ఉత్తరప్రదేశ్ , బీహర్ మొదటి వరుసలో ఉన్నాయి. అలా కాకుండా జనాబా పరంగా నేరాల దామాషాను లెక్క కడితే బాగుండెది. ఎక్కువ మంది ప్రజలు ఉన్నచోట నేరాలు సంఖ్య  కూడా ఎక్కువే ఉంటుంది కదా. 

   మహిళల ఆత్మగౌరవం కించపరచడం లో ఆంద్రా ఫస్ట్ ప్లేస్ లో ఉంటే , తెలంగాణా 3 వ ప్లేస్ లో ఉంది. అలాగే బస్సుల్లో రైళ్ళలో లేడిస్ ని కెలకడం లో ఆంద్రా మొదటి స్తానం లో ఉంటె అతి తక్కువ జనాబా ఉన్న కేరళ 2 స్తానంలో ఉంది. తెలంగాణా 5 స్తానం లో ఉన్నది అని లెక్క ప్రకారం చెప్పినప్పటికీ నమోదు అయిన కేసులు 3 మాత్రమే , 2 నుండి 5 స్థానం వరకు ఉన్న రాష్ట్రాలలో జ్ఞమోదు అయిన కేసుల సంఖ్య 30న అయితే , మొదటి ప్లేస్ లోఈ ఉన్న ఆంద్రాలో 65 కేసులు నమోదు కావడం చూస్తుంటె బస్సుల్లో రైళ్ళలో "మగబుద్ది " ప్రదర్శించడం లో ఎంత ఉబలాటమో అర్దమవుతుంది. 
             ఇకపోతే పని ప్రదేశాలలో ఆడవాళ్ళను ఇబ్బంది పెట్టడంలో తమిళ తంభి లదే అగ్రస్తానం. తర్వాతి స్తానాలు వరుసగా ఆంద్రా , మహారాష్ట్ర , తెలంగాణా ఆక్రమించాయి. ఇక్కడ కూడా 2,3,4 స్తానాల్లో ఉన్న రాష్ట్రాలలో ఎన్ని కేసులు నమోదు అయ్యయో ఇంచు మించు  అదే స్తాయిలో మొదటి ప్లేస్ లో ఉన్న తమిళ నాడు ఒక్క రాష్ట్రం లోనే అన్ని నమోదు అయ్యాయి. దీన్ని బట్టి పని చేసే మహిళలను కెలకడంలో తమిళులు ఘనులు అని తెలుస్తుంది . 

     ఇక పోతే ఏ మాటకా మాటే చెప్పుకోవాలి. మనోళ్ళు ఆడవాళ్ళను గోకడం లో ఫస్ట్ తప్పా , అత్య్చారాలు కాడికి వచ్చే సరికి కాస్త కాదు, చాలా వెనుకపాటె . ఈ  విషయం లో  మొదటి రాంక్ లో ఉన్న మద్యప్రదేశ్ 5067 కేసుల నమోదు తో మొదటి స్తానం లో ఉండగా , తెలంగాణా 979, ఆంద్రా 961 కేసులతో 11, 12 స్తానాల్లో ఉండడం ఊరట కలిగించే విషయమ్. పర్సంటేజ ప్రకారం చూస్తే మద్యప్రదేస్  కేసులలో 19% మాత్రమే తెలుగు రాష్టాల్లో నమోదు అయ్యాయి. 

     మరి ఆడవాళ్ళను గోకడం లో ముందున్నతెలుగు  రాష్ట్రాలు ,  అత్యాచారాలు ,  విషయాల్లో వెనుకపడతానికి కారణం ఏమిటా అని ఆలోచిస్తే తెలుగోళ్ళకి నోటి దూల , చేతులు దూల ఎక్కువ. గోకడానికి అవి చాలు . అత్యాచారం విషయం లో మానవత్వమో, చట్ట బయమో పని చేసి వారిని వెనుకపడెలా చేస్తున్నాయి కాబోలు. అయినా నేరాలు నమోదు అయినంత మాత్రానా , అవన్నీ నిజం కేసులే అనుకోవటానికి వీలు లేదు. కేసులు కోర్టు విచారణ తర్వాత కాని  నిగ్గు తేలవు. ఆ లెక్కలు కూడా చెపితే ఇందులో దొంగ  కేసులు ఎన్నో, అసలు కేసులు ఎన్నో తేలుతాయి. ప్రత్యర్డులని దారిలోకి తెచ్చుకోవడానికి కొంత మంది స్త్రీలు  తప్పుడు కేసులు పెడుతున్నట్లు, న్యాయస్తానాల రికార్డులు తెలియ చేస్తుండడమ్ దురద్రుష్టకరం. 

    ఏది ఏమైనా ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో , అక్కడ దేవతలు నివసిస్తారు అన్నభారతీయ సాంప్రదాయాన్ని గౌరవించి,పూజించకపోయినా  కనీసం  వారిపట్ల  గౌరవ మర్యాదల తో మెలగడం ప్రతి పురుషుని ధర్మం.

                                               (21/8/2015 Post Republished)
Saturday, 20 August 2016

చేసే ఉద్యోగం తిరుమల కొండ మీద, మత ప్రచారమేమో "కల్వరి కొండలు" గురించా?                                                          

                                                                  

  మన దౌర్భాగ్యం వల్ల, దివంగత ముఖ్యమంత్రి గారు తను నమ్మిన మతానికి రాష్ట్రంలో పెద్ద పీఠ వేయాలనే సంకల్పంతో, హిందువులు అత్యంత పవిత్రంగా ఆరాధించే తిరుమల-తిరుపతి కొండల స్వామి క్షేత్రాన్ని కొంత మంది అన్యమతస్తులకు అలవాలంగా చేస్సాడు. అందులో భాగంగా ఒక ప్లాన్ ప్రకారం వివిద ప్రాంతాలనుండి కొంత మంది అన్య మత భోదకులను కొండ మీద ఉన్న ప్రైవేట్ హోటల్లు లాంటి ఇతర సంతలలో వర్కర్స్ గా చేర్పించి, వారి ద్వారా చాప క్రింద నీరులా మత ప్రచారం చేయించారు. అది ఎంతవరకు వెళ్ళిందంటే, తిరుమల కొండలు  అంటే ఏదు కొండలు కాదని, ఒక కొండ మాత్రమే అని మిగతా వాటి మీద అందరికి హక్కు అంటే ముఖ్యంగా ఆ వంకతో తమ మత సంస్తలు నెలకొల్పుకునే హక్కు ఉందని ప్రాచారం చేయడం వరకూ వెళ్ళింది. కాని తానొకటి తలిస్తే దైవం వేరొకటి తలచినట్లు, వారు గోర దుర్ఘటనలో మ్రుతిచెందడంతో అన్యమత విశ్వాసులకు గొంతులో వెలక్కాయ పడినట్లయింది.

   కాని కాసులకు కక్కుర్తి పడే మన అధికారులు గురించి తెలుసు కాబట్టి, తమ పద్దత్తులను వారు ఇంకా గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్నట్లుంది. నిన్న తిరుమల కొండ మీద జరిగిన సంఘటన దీనినే ద్రువ పరుస్తుంది. ఎక్కడో గోదావరి జిల్లా నుండి వచ్చి, కొండ మీద "బాలాజీ" కాంటీన్లో పని చేస్తున్న బార్య భర్తలు దగ్గర, అన్యమతంలో చేరడానికి పెట్టుకునే అప్లీకేషన్ దొరికింది. దానిని వారి చేతిలో ఉండగా చూసిన భక్తులు గోల చేసి సంబందిత అధికారికి పిర్యాదు చ్స్తే, వారి విచారిస్తే వారేదో కల్ల బొల్లి కభుర్లు చెపుతున్నట్లు గా తెలుస్తుంది.

   సహజంగా హిందూ మతస్తులు "లౌకిక" భావాలు కలిగి ఉంటారు. కారణం ఇతర మతాల వలే వీరికి ఒక ప్రవక్త, ఒక దేవుడు అని లేకుండా బహుళ దేవతా రాధన వల్ల అందరితో సామరస్యంగా ఉండటానికి ఇది అవసరం. కాబట్టి హిందువులకు లౌకిక తత్వం గురించి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. కాని అన్య మతస్తులు, ముఖ్యంగా రాజకీయ అండ చూసుకుని హిందూ మతం నుండి అన్య మతం లోకి చేరిన వారు తమకు పైనుండి  లభించే ఆర్దిక సహాకారంతో ముందు వెనుకలు చూసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ, ముఖ్యంగా తిరుమల కొండ మీద రహస్య మత ప్రచారం చేస్తూ, క్రింది స్తాయి పని వారిని వారు మారిన మతం లోకే మారుస్తున్నారు.వీరికి కొంతమంది అధికారుల అండ దండలు ఉన్నట్లే కనపడుతుంది. ఇటువంటి వారిని స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించడం ద్వారా గుర్తించీ ఏరివేస్తే తప్పా తిరుమల క్షేత్రానికి ముప్పు తప్పి పోదు. ఆ.. ఏమవుతుందిలే.. అని హిందువులు అలాగే చూస్తూ కూర్చుంటే కాసులుకు అమ్ముడు పోయే వారు ఏదో ఒక రోజు తిరుమల కొండలను "కల్వరి" కొండలుగా మార్చటం ఖాయం.
                                                        (16/7/2013 Post Republished)