తల్లి తండ్రుల పోషణ బాద్యత,మగపిల్లలది మాత్రమే కాదు, ఆడపిల్లలది కూడా!




                          కాలం మారుతుంది. దానికనుగుణంగా మన కుటుంబ వ్యవస్త కూడా మారుతుంది. ఒకప్పుడు పున్నామ నరకం నుండి రక్షించే వాడు "పుత్రుడు" అనే నమ్మక్కం ఇప్పుడు ఎవరికి లేదు.చచ్చాక   కలిగే పున్నామ నరకం సంగతి దేవుడెరుగు, బ్రతికున్నంత కాలం ఆప్యాయంగా, ప్రేమతో ఒక ముద్ద పెట్టే బిడ్డ కోసం ముసలి తల్లి తండ్రులు పరితపించి పోతున్నారు. వారు ఆడా, మగ అనే బేదబావమేమి లేదు. వేళకు గౌరవంగా ఇంత తిండి పెట్టి , ప్రేమ తో పలకరిస్తే చాలు. కాని కలి కాలంలో అది దుర్లబమే అనిపిస్తుంది, నిన్న కరీంనగర్ జిల్లాలోని,రామగుండం ప్రాంతం లో జరిగిన సంఘటన వింటుంటే.

  పాపం! ఎనబై యెండ్ల తల్లి. భర్త లేడు. నలుగురు కొడుకులు, ఒకతె కుమార్తె. తనకున్న భూమి కాలరీస్ వారు తీసుకుని నష్ట పరి హారం చెల్లిస్తే, దానిని  ఆ కొడుకులకు సమానంగా పంచిందట. కూతురికి ఏమన్నా ఇచ్చింది, లేనిది తెలియదు. పాపం ఆ ముసలి తల్లిని సాకటానికి ఆ కసాయి కొడుకులకు మనసు రాలేదు కాబోలు, ఎవరూ తీసుకెళ్లనందు వల్ల ఆమె ఒక్కతె తన స్వంత ఇంటిలో ఉంటూ పాఠశాల పిల్లల మధ్యాహ్న బోజనంతో జీవీంచేదట.వారికి కూడ సెలవులు ఇవ్వడంతో పాపం ఆకలి బాద తాళలేక వంటి మీద కిరోసిన్ పోసుకుని తనువు చాలించిది ఆ మాత్రుమూర్తి. ఆ తర్వాత కూతురి కంప్లెంట్ మీద కేసు నమోదు చేసిన పోలిసులు కొడుకులు మీద కేసు పెట్టి అరెస్ట్ చేసారట!

   ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, కొడుకులు నలుగురు కసాయి వాళ్ళైనా, కూతురుకు ఏ మాత్రం ప్రేమ ఆ తల్లి మీద ఉన్నా ఆమెకు ఆకలి చావు ఉండక పోయేదే. ఈ రోజుల్లో ఆస్తులు,  సమానంగా పంచుకునే అధికారం చట్టాలు అటు మగ పిల్లలకు, ఇటు ఆడ పిల్లలకు కల్పించాయి.కాబట్టి బాద్యతల నుంచి కూడ ఎవరూ తప్పించుకోలేరు. నాకు మా తల్లి తండ్రులు, అన్నదమ్ములు  ఆస్తులు ఇవ్వలేదు, కాబట్టి ముసలివారిని చూశే బాద్యత మాకు లేదు అనే వాదన తప్పు. మీ ఆస్తులను మీరు కొట్లాడి తీసుకోండి. అలాగే అన్నదమ్ములు తల్లితండ్రులను చూడకపోతే,ఆ ఔదార్యాన్ని మీరు చూపండి. ఆడ పిల్లలు అటు చదువులలోనే కాదు, ఇటు తల్లితండ్రుల మీద ప్రేమ చూపడం లో కూడా మగపిల్లల కన్నా, అన్ని విదాల మెరుగు అని రుజువు చేసుకుంటున్నారు.కాబట్టి ఆ వ్రుద్ద మాతాపితలను, మీ ప్రేమా అమ్రుతంతో  బ్రతికేలా చెయ్యండి.

   వ్రుద్దుల సంరక్షణ కోసం ప్రబుత్వం వారు కూడ కొన్ని కఠినమైన చట్టాలు చెయ్యాలి. అవసరమయితే, వ్రుద్దాశ్రమాలు  ఏర్పాటు చేసి వారిని పోషించాలి., తల్లితండ్రులను పట్టించుకోని పిల్లలనుండి "రెవెన్యూ రెకవరీ ఏక్ట్" క్రింద వ్రుద్దులకు ఖర్చు చేసిన దానిని రాబట్టాలి. ఇన్స్యూరెన్స్ లోని "పే అండ్ రెకవరి" విదానాన్ని, వ్రుద్దుల సంక్షేమం లోను పాటించాలి.అంతే కాని వ్రుద్దాప్య పించన్ల వల్ల అవినీతి అధికారులకి తప్పా వ్రుద్దులకు ఒరిగేది తక్కువే.

    ప్రేమించే పిల్లలు లేకపోయినా కనీసం కూడు పెట్టి ఆదుకునే  ప్రబుత్వం లేక సమాజం  ఉందని ఆ వ్రుద్ద మాత పితలకు భరోసా ఇవ్వవలసిన అవసరం మనమీద ఎంతయినా ఉంది.  

                                                          (30/5/2013 Post Republished).        

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన