సూపర్ మాన్,స్పైడర్ మాన్ లు కాదు, మనకు కావలసిందీ ఈ "ఫ్యామిలి మాన్" లు మాత్రమే!

               


  నిజంగా ఇది ఒక అద్బుతమైన వార్త! మానవ సంబందాలు నాగరికత మాటున మ్రుగ్యమవుతున్న వేళ, కుటుంబ బందాలు, ఆర్థిక సంబందాలుగా చూడబడుతున్న వేళ, ఒక నిజమయిన బారతీయుడు అంటే నాగరికతకు దూరంగా బ్రతుకుతున్న కేరళ గిరిజనుడతడు. పేరు అయ్యప్పన్. ఇతను తన బార్య సుదతో కలసి "కోన" అడవుల్లో తేనే సేకరణ ద్వారా జీవిస్తున్నాడు. బార్యకు ఏడు నెలల గర్బం. హట్టాతుగా నెప్పులు వచ్చే సరికి దగ్గరలో వైద్య సదుపాయం లేక విలవిల లాడి పోయాడు. ఒక ప్రక్కన జోరున వాన. ఇంకొక వంక వాహన సదుపాయం లేని ప్రాంతం. క్షణం ఆలోచించిన బార్యా, లోపలి బిడ్డ దక్కడం కష్టమని బావించిన అయ్యప్ప ఆలస్యం చెయ్యకుండా, బార్యను బుజాన వేసుకుని, నడక మొదలెట్టాడు పట్నం వైపు. ఒకటి కాదు రెండు కాడు ఏకంగా నలబై కిలోమీటర్లు, అదీ అడవిలో ఏక బిగిన నడచి హాస్పిటల్కు బార్యను చేర్చాడట! పాపం బిడ్డను రక్షించలేకపోయినా, బార్యను మాత్రం కాపాడ గలిగారు డాక్టర్లు.

   ఇక్కడ మనం చూడాల్సింది అయ్యప్ప యొక్క నడక శామర్ద్యం గురించి కాదు. బార్య బిడ్డ మీద తనకున్న అంతులేని ప్రేమాను రాగాలు. నిజానికి జోరున కురిసే వానలో నలబై కిలోమీటర్లు ఒక గర్బవతిని ఎత్తుకొని రావడం ఆమె అరోగ్య పరంగా కూడా రిస్క్తో కూడుకున్న పనే అయినప్పటికి గత్యంతరం లేని పరిస్తితిలో అతను చెయ్యగలిగింది చేశాడు.బార్యా బిడ్డల్ని హింసించే బడుదాయిలు, ఈ బారతీయున్ని చూసి సిగ్గు పడాల్సిందే!

   మనం సినిమాల్లో సూపర్ మాన్, స్పిడర్ మాన్లు చేసే సాహస ఘట్టాలు చూసి అబ్బురపడుతుంటాం.  కాని అటువంటి అద్బుతాలు చేసే వారు కుటుంబ రక్షణకు అవసరం లేదు. అయ్యప్పన్ లాంటి "ఫామిలీ మాన్" ప్రతి ఇంటిలో ఉంటే అంతకు మించిన అద్రుష్టం ఆ కుటుంబ సబ్యులకు ఏం కావాలి! గ్రేట్ అయ్యప్పన్ ! హాట్స్ ఆఫ్ యూ! 




Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన