Posts

Showing posts from October, 2015

శుభమా అని బ్లాగులో "సంప్రదింపుల పారమ్ "పెడితే , నాకొచ్చిన మొదటి సందేశం ఇది!

Image
                                                         హలో. నేను జీవితంలో సమయం ఇస్తుంది ఒక ప్రైవేట్ రుణ రుణదాత మిస్ ఫిలిప్ కెన్ am మొదలైనవి వ్యక్తులకు అవకాశం రుణ, వ్యాపార సంస్థలు , బీమా, ఆర్ మీరు ఏ ఆర్థిక కష్టాల్లో లేదా రుణ అవసరమైన పెట్టుబడి లేదా మీరు చేయడానికి ఏ మరింత మేము ఇక్కడ ఉంటాయి మీ బిల్లులు అన్వేషణ చెల్లించడానికి ఋణం అన్ని మీ ఆర్థిక సమస్యలు గతంలో ఒక విషయం. మేము అన్ని రకాల అందించే ముందస్తు ఫీజు లేకుండా 2 % చొప్పున ఏ కరెన్సీ విలువ కలిగిన లో రుణ. నేను మీరు మేము సిద్ధంగా ఉన్నట్లు తెలియజేయడానికి ఈ గొప్ప మీడియం ఉపయోగించడానికి కావలసిన మీ ఆర్థిక సమస్య పరిష్కరించడానికి రుణ ఎలాంటి మీకు సహాయం. అవును అప్పుడు  E-philipkenloan@gmail.com  ద్వారా ఇప్పుడు తిరిగి వస్తే మరిన్ని వివరాలకు , మీరు అత్యంత సంతోషాన్నిస్తుంది ... భవదీయులు,  పంపిన వారి బాషలో చెప్పాలంటే ఇది.  Hello.  I will give you the time in the life of a private loan lender can not miss the Phillip am  Etc. The loan is likely to individuals, business firms, insurance, or  If you need any financial

అవ్వ! అవ్వ! సోనియా గాంధి గారి కుటుంబం ,దొంగిలించబడిన "భారతీయ పురాతన వస్తువుల " ను విదేశాలకు స్మగ్లింగ్ చేసిందా?!!!

Image
                                                                                                               అవుననే అంటున్నారు ప్రముఖ న్యాయవాది శ్రీ సుబ్రమణ్య స్వామీ గారు! ఇదేదో కేవలం రాజకీయ ఆరోపణలు లాంటిది అయితే తేలిగ్గా కొట్టి పారేయొచ్చు. కాని గతం లో ఇదే విషయమై డిల్లి హై  కోర్టులో   కేసు వేసి , సాఖ్శ్యాదారాలు కొన్ని కోర్టు వారికి సమర్పించడం జరిగింది. కాని చివరకు అప్పటి సోనియా గాంది గారి ప్రభుత్వం ఒత్తిడి మేరకు , C.B.I వారు విచారణను ముందుకు కొనసాగకుండా మోకాలు అడ్డడం వలన , స్వామీ గారు ఏమిచేయలేక నిస్సహాయ పరిస్తితిలో ఉండి పోయారు అట. సుబ్రహ్మణ్యం గారి మాటల్లో , అసలు జరిగింది ఏమిటంటె:-                                   భారతదేశంలో ఇందిరా గాంధి , రాజీవ్ గాంధి గార్లు ప్రదాన మంత్రిగా ఉన్న కాలంలో , ఇటలి  కి  వెళ్ళెఎయిర్ ఇండియా, అల్ ఇటాలియ  విమాన సర్వీసుల్లో క్రేట్స్ కు క్రేట్స్ ఎటువంటి తనికిలు లేకుండా తరలించబడెవి అట. వాటిలో భారతదేశం లో వివిధ ప్రాంతాలలో దొంగిలించబడిన  పురాతన విగ్రహాలు, నాణేలు, పెయింటింగ్స్ ఉండెవి అట. వాటిని ఇటలిలోని రివోల్ట , ఆర్బస్సనో అనే ప్రాంతాలలో , సోనియా గాంధి గార

కబేలాలలో చంపబడుతున్న ఆవుల ఉసురు , ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులుకు తగులుతుందా?

Image
                                                                                                                       మనిషి తన అవసరాల కోసం కొన్ని రకాల జంతువులు మీద అదారపడడం అనాదిగా వస్తున్నదే. మన సమాజం ప్రాదమికంగా వ్యవసాయం మీద ఆదారపడింది కాబట్టి, వ్యవసాయం లో తనకు సహాయం చేసే ఆవులు వాటి సంతతితిని   పూజించడం అనేది అలవాటు చేసుకున్నాం . నూటికి 80% మంది వ్యవసాయదారులుగానో , వ్యవసాయం మీద ఆదారపడిన వారిగానో జీవిస్తున్నాం కాబట్టి , మనకు పాలిచ్చి మన ఆరోగ్యాన్ని , కోడె దూడలను ఇచ్చి మన వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తున్న గో సంతతితిని పూజించడం లో రైతుల కనీస ధర్మమే తప్పా వేరేది కనపడదు. ఇదే సూత్రం బర్రెలకు కూడా వర్తిస్తుంది. అందుకే సంక్రాంతి తర్వాతి రోజును "కనుమ" పండుగను ప్రత్యేకంగా "పశువుల పండుగ " గా పరిగణించి ఇంట్లో పశువులకు పూజలు చేస్తుంటాం. అలాగే కొత్త గా ఇండ్లలోకి వెళ్ళేటప్పుడు ఆవును తీసుకుని వెళ్ళడం మన సాంప్రదాయం. అలాగే మన ఇండ్లను కాపలా కాసే "కుక్క" కోసం కూడా ఒక పండుగ ఉంది మనకు. దానినే"కోరల పున్నమి " లేక  "కుక్కల పండుగ" అంటారు పల్లెటూళ్ళలో .

గుడిలో ఇలాంటి "గుడి చేటు " పనులు చెయ్యడం నేరం కాదా?

Image
                                                                                                                                                                                                వారు యువతీ యువకులు . ఇద్దరూ గుడికి అంటే శివాలయానికి వచ్చారు. అక్కడ అమ్మాయి గుడి అంతరాలయం వెలుపల ఉంది. అబ్బాయి లోపల ఉన్నాడు. అమ్మాయిని లోపలికి రమ్మని బలవంతపెడితే లోపలకు అంటే అంతరాలయం లోకి వచ్చింది. అక్కడ అతను ను ఆ అమ్మాయి నుదిటి మీడ బొట్టు పెట్టినట్లు పెట్టి అదే ఉపులో ఒక ముద్దు కూడ పెట్టి తన తమకం తీర్చుకున్నాడు. వారిద్దరూ భార్యాభర్తలు కాదు అనేది స్పష్టం ఎందుకంటే భార్య భర్తల మద్య అలా గుడిలో ముద్దులు పెట్టుకోవాలనే ఆత్రపు కోరికలు ఉండవు. పోని ప్రేయసి ప్రియులు అయినా , తమ కోరికలు తీర్చుకోవడానికి గుళ్ళను ఎన్నుకోవడం తగని పని. ఏ రకంగా చూసినా వారు ముక్యంగా ఆ అబ్బాయి చేసిన పని మత విశ్వాసాలను గాయపరచే పనే. ఇది ఇండియన్ పీనల్ కోడ్ ప్రకార ం నేరం కూడా .                                           కాని విచిత్రం ఏమిటంటే యూ ట్యూబ్ లో ఈ వీడియో మీద కామెంట్ చేసిన వారిలో అధిక శాతం వీరు చేసిన పనిని సమర్దించారు.తప్ప

అమరావతి భారతదేశ రెండో రాజధాని కానుందా!?

Image
                                                                                                                                         అమరావతి ! నవ్యాంద్ర నూతన రాజధాని! రేపు విజయదశమి నాడు గుంటూర్ జిల్లా, తుళ్ళూర్ మండలంలోని ఉద్దండ రాయుని పాలెంలో, అమరావతి నగర నిర్మాణానికి, భారత దేశ ప్రియతమ ప్రధానమంత్రి గారైన శ్రి నరేంద్ర మోడి గారి చేతుల మీదుగా శంకుస్తాపన జరుగనుంది. ఇదేదో మాములు ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా అత్యంత వేడుకగా, యజ్ణ హోమాది క్రతువులతో పాటు, సర్వ మత ప్రార్దనలతో, అనేక మంది జాతియ, అంతర్జాతీయ అధికార, అనధికార ప్రముఖుల సమక్షంలో దూం దాం గా జరుగుతున్న కార్యక్రమం. దీనిని కేవలం ఒక రాష్ట్ర రాజధాని శంఖుస్తాపన కార్యక్రమం అనుకునేలా కాకుండా, ఒక జాతీయ స్తాయి రాజధాని నగర శంఖుస్తాపన కార్యక్రమం అని తలపించేలా ఘనంగా కార్యక్రమాలు నిర్వహింస్తుంది, ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం.             కేవలమ్ ఒక రాష్ట్ర  రాజధాని నగర నిర్మాణం కోసమే అయితే, ఆ రాష్ట్రం లోని పుణ్యనదీ జలాలు, పుణ్యక్శేత్రాల నుండి మట్టి ని తెప్పిస్తే సరి పోతుంది అనుకుంటా. కాకపోతే హిందూ దేశం లోని పుణ్య  నది  జలాలు కూడా తెప్పించవచ్చు.

రచయితలని "రైటింగ్స్ " తో ఎదుర్కొండి ! ఫైటింగ్స్ తో కాదు !

Image
                                                                                                                రెండు సంవత్సరాల క్రితం మన ఉమ్మడి తెలుగు  రాజధాని , హైదరాబాద్ నడిబొడ్డున ఒక మహిళా రచయిత్రిని పట్టుకుని ,  మీడియా సాక్షిగా , ప్రెస్ క్లబ్ లొనే దాడి చేసారు, సెక్యులర్ ముసుగులో ఉన్న మత వాదులు కొందరు.  పాపం బంగ్లాదేశ్ కు చెందిన ఆ రచయిత్రి కళ్ళల్లో , ఆ నాడు తొణికిసలాడిన భయబ్రాంతులు చూస్తే ఎవరికైనా అయ్యో పాపం అనిపించక  మానదు. అందుకేనేమో ఆమె గారు తన రచనల్లో "ప్రపంచంలో ఆ మతవాదులు అంత హింసావాదులు ఏ మతం లోను ఉండరు" అని డంకా బజాయించి మరీ చెప్పింది . ఇంతకీ ఆమె చేసిన తప్పు ఏమిటంటే తనకు నచ్చని ఆ మత విదానాలు గురించి తన రచనల్లో బావవ్యక్తికరణ చేయడమే. అప్కోర్స్ అవి వారి మనో బావలను దెబ్బ తీసి ఉండవచ్చు అనుకుంటా. దానికి ఆమె మీద చట్టపరమైన చర్యలు తీసుకుని ఉండవచ్చు. లేకపొతే, చేతనైతే  ఆమె రచనా తీరును ఎండగడుతూ , తమ బావాలని సమర్దించుకుంటూ కౌంటర్ రచనలు చేయవచ్చు. దీని ద్వారా ఆమెకు దీటైన సమాదానం ఇవ్వవచ్చు. కాని ఇవ్వన్నీ చేయకుండా కేవలం బల ప్రయోగం తో ఆ మహిళా రచయిత్రిని బెదరించి కీచకానందం పొం

ఈ పాస్టర్ గారి అద్బుత వైద్యం చూసాక "జన విజ్ఞాన వేదిక " వారు ఆత్మహత్యలు చేసుకోవాల్సిందే !

Image
                                                                                                             ఎక్కడో మారుమూల పల్లెటూళ్ళలో ప్రజలు బాణామతి ,చిల్లంగి లాంటి మానసిక వ్యాదులకు గురి అయి , ఖరీదైన వైద్యం భరించలేకనో , తగిన అవగాహన లేకనో స్తానిక మంత్రగాల్లను ఆశ్రయించి ఉపశమనం పొందుతుంటె , దానికి కేవలం స్తానిక   మతాలను,  టార్గెట్ చేసే దురుదేస్యంతో , మంత్రగాళ్ళ మీద , బాబాల మీద తెగ విరుచుకుపడే జన విజ్ఞాన వేదిక బాబులకు , అన్యమతస్తులు చేసె బహిరంగ బోగస్ వైద్యాలు , అది కూడా పెద్ద పెద్ద నగరాల నడిబొడ్డున , చదువుకున్న మూర్కుల సాక్షిగా జరుగుతుంటే కళ్ళకు కనపడవా? లేక వారి జోలికి వెళితే విజ్ఞానుల బాక్సులు బద్దలు అవుతాయని బయమా?                 ముంబాయి లాంటి నగరం నడిబొడ్డున , వేలాది ప్రజల సాక్షిగా , రెండు కిడ్నీలు పెయిల్ అయాయి అని చెప్పబడుతున్న ఒక రోగిని , కేవలం నిముషాల వ్యవదిలో , ప్రార్ధనలు ద్వారా కిడ్నీలు ను బాగుచేయడమే కాక , రోగిని పరుగులెత్తిస్తూ , విశ్వాసులు   అంతా చప్పట్లు కొడుతుంటే , ఎంత అద్బుతంగా ఉందో కదా వారికి.ఇలాంటి అద్బుతాలు చూసే కదా వారంతా స్వచ్చందంగా మతం మారిపోతుంది? ఇలాంటి అద్