ఆకాశంలో సగం , అవినీతిలో ఆసాంతం అన్నందుకే ఆ 3 మహిళా సర్పంచుల చెక్ పవర్ రద్దు చేశారా?!!



                    ఈ  రోజు ఈ నాడు డైలీ  ఖమ్మం జిల్లా ఎడిషన్ లోని ఒక  వార్త ప్రత్యేకతను సంతరించుకుంది. అదేమిటంటే అవినీతి కి పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు లభ్యమైనందుకు గాను ఖమ్మం జిల్లాలోని 3 సర్పంచుల చెక్ పవర్ లను జిల్లా పంచాయతీ అధికారి నారాయణ రావుగారు రద్దు చేశారు. అయితే ఇందులో విశేషం ఏమిటంటే సదరు ముగ్గురు సర్పంచ్ లు మహిళలే కావడం. పురుషులతో పాటు స్త్రీలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కావాలి అని అభిలషిస్తున్న మనం అభివృద్ధిలో ఏమో కానీ , అవినీతిలో మాత్రం పురుషులను మించిపోయారు స్త్రీలు అని తెలిపే అనేక ఉదంతాలలో ఈ మహిళా సర్పంచ్ ల చెక్ పవర్లూ రద్దు ఉదంతం కూడా ఒకటి కాబోలు. ఇంతకీ వారు చేసిన అవినీతి ఏమిటంటే 
(1). భద్రాచలం డివిజన్ లోని చర్ల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినా జ్యోతిర్మయి గారు 44 లక్షల పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారట. అందుకు బాద్యుడు అయిన పంచాయతీ కార్యదర్శి పేరు దేవరాజ్ . 

(2). వాజేడు మండలం చెరుకూరు గ్రామ సర్పంచి అరుణ గారు 10. 30 లక్షల నిధులు దుర్వినియోగం చేశారట . దానికి బాద్యుడిగా పంచాయితీ కార్యదర్శి బాబురావు ఉన్నారు అట . 

(3). అశ్వారావు పేట మండలం ఉట్లపల్లి గ్రామ సర్పంచ్ వీరకుమారి గారు 3. 25 లక్షల నిధులు దుర్వినియోగం చేయగా దానికి బాద్యుడిగా పంచాయతీ కార్యదర్శి దొడ్డా ప్రసాద్ ఉన్నారట. 

                                                                          

  
                    విద్యా , ఉపాధి రంగాల్లో స్త్రీలు పురుషులు కంటే ఎక్కువ ప్రతిభను చూపుతూ ముందుకు చొచ్చుకుని పోవటం ఒకవైపు సంతోషం కలిగిస్తుంటే , ఇలా రాజకీయ రంగంలో స్త్రీలు పురుషులను మించి పోయి అవినీతికి పాల్పడటం విచారించదగిన విషయమే. జిల్లాలో ఎంతో మంది సర్పంచ్ లు ఉండగా కేవలం మహిళా సర్పంచ్ లే అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు లభించడం చూస్తుంటే , వారికి పాలన మీద ఉన్న పట్టు , పంచాయతీ లెక్కల నిర్వహణలో లేనట్లు తెలుస్తోంది. పురుష సర్పంచ్ లు ఉన్న చోట్ల పంచాయతీ సెక్రటరీలు లెక్కలు విషయం లో కరెక్టుగా ఉంటారు కాబోలు. అదే మహిళా సర్పంచ్ లు అయితే గోల్ మాల్ చేసినా తెలుసుకోలేరులే అనే ధీమా కాబోలు. 

   ఏది ఏమైనా ఆకాశం లో సగం కావాలనుకునే వారు , ఇలా అవినీతిలోమాత్రం ఆసాంతం వారికే అన్నట్లు నిధుల దుర్వినియోగానికి పాల్పడడం విచారించ దాగిన విషయం. 

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన