Monday, 23 January 2017

కుర్రాళ్ళు జాగ్రత్త ! జీన్స్ (Jeans) ప్యాంట్ లు వేసుకుంటే ,మీలోని జీన్స్ (Genes) సిగ్గుపడి భూమిమీదకు రావట !!?

          నిన్నధార్మిక ప్రవచన కర్త శ్రీ శ్రీ గరికపాటి నరసింహా రావు గారి ప్రవచనాల తాలూకు వీడియో ఒకటి చూసాను . అయన  ధార్మిక గ్రంధాలు లోని   విషయాలు ను నేటి పరిస్థితులకు అన్వయించి చెప్పడం లో దిట్ట . అయన కు ఈ  మధ్య, సంతాన సాఫల్య కేంద్రం నడుపుతున్న  డాక్టర్ దంపతులు , ఒక విషయం చెప్పి దానిని తమ ప్రవచనాల రూపం లో ప్రజలకు తెలపాలని చెప్పారట. దానిని అయన తు .చ  తప్పకుండా అమలు చేశారు . వారు ఏమి చెప్పారో వివరంగా తెలుసుకోవాలంటే క్రింది వీడియోను చూడవచ్చు.
video
                                    పై వీడియో సరిగా కనిపించని పక్షం లో క్రింది లింక్ ను క్లిక్ చేసి చూడవచ్చు.                                      
                               
 వీడియో లింక్:-  https://www.facebook.com/sanjeeva1977/videos/1242664379146989/
                         

                           
   తెలుసుకున్నారుగా ! విషయ పరిజ్ఞానం లేక ప్యాషన్ ల మోజులో వేలకు వేలు తగలేసి  ఏది పడితే అది డ్రెస్ లు ధరిస్తే ,చివరకు ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. అమ్మాయిలకు అందంగా కనపడాలని టైట్ జీన్స్ వేసి , మోడ్రన్ బైక్ మీద రయ్యిన దూసుకెళుతుంటే , అందమైన అమ్మాయిల మనస్సు దోచుకుంటారేమో కానీ, వారిని మాత్రం అమ్మలు చేయలేరట!. భారత దేశం లో నానాటికి అధికమవుతున్న పురుషుల సంతాన హినత సమస్యకు ఈ టైట్ జీన్స్ ప్యాంట్ లు వేసుకోవడం కూడా ఒకటి అంట. మరి ఈ  స్కిన్నీ జీన్స్ ల వలన కేవలం మగవాళ్లకేనా , ఆడపిల్లలకు ఏ సమస్యా ఉండదా అంటే , బేషుగ్గా ఉంటుందని తెలియచేస్తున్నార్తు . టైట్ ప్యాంట్ లు ధరించిన స్త్రీల కాళ్లకు రక్త సరఫరా సరిగా జరుగనందువలన అనేక మంది ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్లో చేరుతున్నారని అధ్యయనాలు  తెలియచేస్తున్నాయి. వివరాలు కొరకు క్రింది లింక్ ను క్లిక్ చేసి చూడండి. అయితే స్త్రీలకు సంతాన హీనత సమస్య మాత్రం టైట్ జీన్స్ వలన రాకపోవచ్చు .

    కాబట్టి కుర్రాళ్ళు జాగ్రత్త!జీన్స్ (Jeans) ప్యాంట్ లు వేసుకుంటే , మిలో సంతాన కారకాల   ఉత్పత్తి ఉండదు కాబట్టి   మీరు తండ్రులు అయ్యే అదృష్టాన్ని కోల్పోతారు . మీరు వీరుల్లాగా టైట్ గా ఉండే జీన్స్ ప్యాంట్ లు వేస్తె , ఆ వేడికి మీలోని జీన్స్  సిగ్గుపడి లోపలే ఉండి  పోతాయి కాబట్టి , చివరకు మీ అజ్ఞానానికి మిరే సిగ్గు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
 Source :- http://thetab.com/2015/06/23/fashion-victim-skinny-jeans-can-serious-health-risk-43022

ఒకరికి ఇల్లాలిగా ఉంటూనే, మరో ఇద్దరికీ ప్రియురాలిగా మారినందుకు "ఆమె" కు ఆ గతి పట్టిందా !?

                                                         
                                                                                                                      "న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి " అని మనువు ఇటువంటి స్త్రీ, పురుషులను చూసి అని ఉంటాడు . స్త్రీ పురుషుల మద్య విచ్చలవిడి వివాహేతర సంబందాలు కుటుంబ వ్యవస్తను ఎలా బ్రష్టు పట్టిస్తున్నాయో ఈ  ఉదంతం తెలియ చేస్తుంది . పెండ్లి అయి , మొగుడు ఉండి ,ఇద్దరు బిడ్డలు తల్లి అయిన వ్యక్తిని ఒక అవివాహితుడు దైర్యంగా తనతో వేరు కాపురం పెట్టమని ఒత్తిడి చేయటమే కాక , అలా చేయనందుకు ఏకంగా హత్యే చేసాడంటే , ఈ సమాజం ఎటువంటి హిన పరిస్తితిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు . దినంతటికి కారణం "లేచి పోయే రాజేశ్వరీ "లను ప్రొత్సాహిస్తున్న దిక్కుమాలిన స్త్రీ  వాదాలు కాక  మరింకేమిటి ?

    ఖమ్మం జిల్లా, మధిర మండలం లోని మడుపల్లికి చెందిన శివారెడ్డి, దంపతులకు ఇద్దరు పిల్లలు. శివా రెడ్డి గారు వీర శివారెడ్డి లాంటి వారు కాదనుకుంటా, వాళ్ళావిడ  గారు మరో రాజశెఖర రెడ్డితో వివాహేతర సంబందం ఏర్పరచుకుంది. అయితే తప్పు అన్నాక ఒకరితో చేసినా పది మందితో చేసినా పెద్ద తేడా ఏమి రాదు కాబట్టి, ఆవిడ గారు మరో వ్యక్తికి కూడా ప్రియురాలిగా మారింది అట !.

  రాజశేఖర రెడ్డికి ముప్పయేండ్ల వయసు. ఇంకా పెండ్లి కాలెదు. పెండ్లి చేసుకుంటే అనవసర ఖర్చు అనుకున్నాడో ఏమో ఏకంగా ఇంకొకరితో అది కూడా పెండ్లి  అయిన దానితోనే  డైరెక్టుగా కాపురం పెట్టాలని నిర్ణయించుకున్నాడు అట. దానికి అతను  ఏ మాత్రం సిగ్గు  పడకపోగా  అంతలా  బరితెగించడానికి కారణం అతని చుట్టూ ఉన్న సమాజంలో పెద్ద మనిషి అనే వాడు లేక పోవడం ఒక కారణమయితే అసలు అతను నివసిస్తున్న  సమాజంలో కట్టుబాట్లు అనేవి లేకుండా పోవడం మరో కారణం కావచ్చు. అందుకే అతనికి అంత  బరి తెగింపు వచ్చి ఉండాలి.

  కానీ శివారెడ్డీ గారి మిసెస్ కి అలాంటి పని చెయ్యడానికి ఆమె లో ఎక్కడో మూలన దాగి ఉన్న సాంప్రాదాయ బావన ఒప్పుకోలేదు అనుకుంటా, అలా వేరు కాపురానికి ఆ ఇద్దరి బిడ్డల తల్లి అంగీకరించలేదు. అంతే! ప్రియుడు కాస్త మ్రుగాడు గా మారాడు. ఆమెను బండ కేసి బాది మరీ చంపాడు. ఇదంతా ఎవరూ చూడకుండానే చేసాడట! అయితే ఈ సంఘటణ ఎవరూ చూడకపోయినా , శివారెడ్డి గారి ఇల్లాలి రెండో ప్రియుడు చూసాడట! అతనే పోలిసులకు ఉప్పు అందించాడు. దానితో పోలిసులు హత్య జరిగిన 24 గంటలు లోపే రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేసి కేసు విచారిస్తున్నారు. ఇది మొన్న జరిగిన సంఘటణ.

  ఇప్పుడు చెప్పండి!ఈ ఉదంతంలో ఆ ఇల్లాలు ది తప్పా కాదా? ఆమె చలం గారి రాజేశ్వరి కదలో లాంటి అసంత్రుప్త స్త్రీ అయి ఉంటే ఒక్క రాజశేఖర రెడ్డితోనే  సంబందం పెట్టుకుని ఉండేది . కానీ ఆవిడ మరొక వ్యక్తితో కూడా వివాహేతర సంబందం పెట్టుకుందంటే ,అది ఆమెలోని విశ్రుంఖలత్వాన్ని తెలియ చేస్తుంది. స్త్రీ అయినా పురుషుడు అయిన సామాజిక  కట్టుబాటుకు తల ఒగ్గక పోతే ఇలాంటి పరిణామలే సమాజంలో చోటు చేసుకుంటాయి. నీతి బాహ్యతతో కూడిన స్త్రీ వ్యామోహం రాజశేఖర రెడ్డిని హంతకుడుగా మార్చి జైలు పాలు అయ్యేలా చేస్తే, అదే రకమైన విశ్రుంఖలత్వం ఆమెను పై లోకాలకు పంపేలా చేసింది. స్త్రీ పురుషుల మద్య సంబందాలు ప్రైవేటివి కాబట్టి , వాటిని సమాజం పట్టించుకోవలసిన అవసరం లేదనుకున్నంత కాలం సమాజంలో క్రైం రేట్ పెరిగిపోతూనే ఉంటుంది.    
                                                    (23/1/2014 Post Republished).

Sunday, 22 January 2017

పుల్ గా మందు కొట్టి కారు నడిపే స్వేచ్చ మగాళ్ళ కేనా ? మాకు లేదా ? అంటున్న మై ఛాయిస్ మహిళ !


                                                                             

నిన్న హైదరాబాద్ లోని పిల్మ్ నగర్ లో పోలిసులు.  డ్రంక్ అండ్ డ్రైవ్(మందు కొట్టి తోలు )  కేసులో 13 మంది  కారు చోదకుల మీద కేసులు పెట్టారట . అంటే ఆ 13 మంది మందు కొట్టి కారును నడుపుతున్న వారే ! కాని ABN ఆంద్రజ్యోతి మీడియా వారికి మాత్రం 12 మంది మంచి వారుగాను , ఒక్క అమ్మాయి మాత్రం బహు చెడ్డదిగాను అనిపించినట్లుంది . కెమేరా మొత్తం ఆమె మీదే పోకస్ చేసి చిత్రికరించడమే కాకుండా 'తాగుబోతు మహిళను అదుపులోకి తీసుకున్న పోలిసులు " అనే శిర్షిక తో యూ టూబ్ లో పెట్టీశారు . ఎంత అన్యాయం!

           బహూశా ఆ అమ్మాయి పోలిస్ వారి కేసుకు సహకరించి ఉండకపోవచ్చు . అలాగే మీడియా వాళ్ళని బండ బూతులు తిట్టి ఉండవచ్చు . అంత మాత్రం చేత కెమేరా మొత్తం ఆమె గారి మీదే పోకస్ చేసి నానా యాగీ చేస్తారా ? ఎంత అన్యాయం ! ఎంత అక్రమం !మీడియా వారు ఆలోచించాల్సింది ఆమె తిట్టే బండ బూతులు గురించి కాదు . ఆ తిట్ల వెనుక ఉన్న ఆమె హృదయ ఘోష గురించి . ఆమె హృదయ ఘోషకు అర్దం ఏమిటంటె :-

              "ఒరే మగ వెదవల్లారా ! తాగి రోడ్లు మీద కార్లు నడిపే స్వేచ్చ మీకేనా ? అభ్యుదయ మహిళలమైన  మాకు లేదా ? అంత మంది మగాళ్ళని కేసుల్లో బుక్ చేస్తే , వారి గురించి పట్టించుకోని మీ మగ కెమెరాలు , మాగురించి పట్టించుకోవడానికి ఎందుకురా అంత తహ తహ లాడుతాయి . తప్పు చెయ్యడం మగాడి గుత్తాది పత్యమా? తప్పు చేసే స్వేచ్చా మగవాడికి ఎంత ఉందో , ఆడదానికి అంతే ఉండాలి . అది మందు కొట్టడం లో అయినా సరే , మనుషుల్ని కొట్టడం లో అయినా సరే . "

     నిజమేగా మరి . ఏదో అ అమ్మాయి "మందు మతి " అయినంత మాత్రానా మంద మతి అనుకుంటే ఎలా? తన  స్వేచ్చా కోసం ఆరాట పడుతున్న అబ్యుదయ మహిళ . స్త్రీ స్వేచ్చ అంటె పురుషులతో అన్ని రంగాల్లో పోటి పడడం . అది ఒప్పుల్లోనె కాదు తప్పుల్లో కూడా . అప్పుడె కదా సమ బావం 1 సమదర్మం! తప్పుడు పనులు అన్ని మగాళ్ళు చేసి , తతిమ్మా పనులు మాత్రమే ఆడాళ్ళు చేయమంటే , నాన్సేన్స్ ! అది ఎలా కుదురుతుంది ?చానళ్ళకు రేటింగులు పెరగాలంటే  మహిళలు  మందు కొట్టాల్సిందె ! రోడ్లు ఎక్కాల్సిందే ! ఎవడైనా మీడియా వాడు తమనే పోకస్ చేస్తే వాళ్ళని బండ బూతులు తీట్టాల్సిందే ! హేట్సాప్ మందుమతి !

                    మందు మతి ఏమంటుందో క్రింది విడియోలో చూడండి .

              
                           పై సంఘటనలోని లాంటి మధ్య సేవన మహిళామణులు హైద్రాబాద్ లాంటి నగరాల్లో తరచుగా పోలీసులకు పట్టుబడుతూనే ఉన్నారట. ఇలాంటి వారి గురించి ఈ క్రింది వీడియో ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు.

                                                         
                                                       (28/12/2014 Post Republished)

                                                                         

Saturday, 21 January 2017

నీచమైన మగబుద్ది కి సాక్ష్యం ఈ 73 యేండ్ల ఖాజీ , 12యేండ్ల అమ్మాయి పట్ల ప్రవర్తించిన తీరు !!?

                                                                       


                               ఒకటి చెప్పు ! రెండు చెప్పు! కోటి సార్లు కోసి చెప్పు! మగబుద్ది తీరే అంత!.శతాబ్దాలుగ మగాడిలో జీర్ణించుకు పోయిన ఆ బుద్ది ,"మగాడు మారాలి " మగాడు మారాలి " అని  స్త్రీ వాదులు స్లోగన్ లు ఇస్తేనో , కఠినమైన చట్టాలు చేసినంత మాత్రానో మారిపోదు. మొన్న కే.సి.ఆర్ గారు షీ టీం ల పని తీరు సమీక్షలో మాట్లాడుతూ , ఆడపిల్లలను ఈవ్ తీజింగ్ చేసే వారిలో కుర్రాళ్ళు కంటే నడి వయసు వారే అధికంగా ఉన్నారని సర్వే లో తేలినట్లు చెప్పారు. మైనర్ బాలికలను లైంగిక వేదింపులకు గురిచెయ్యడం లో తాతల పాత్ర ఏమి తక్కువ కాదు. అందుకే 10 యేండ్ల పిల్ల వాడి 80 యేండ్ల వృద్దుడి వరకు ఎవరైనా సరే, వాడు మగవాడే . వాడిలో ఉండేది మగ బుద్దే . కాకపోతే సమాజం లో చాలా మంది మగవాళ్ళను కట్టు బాట్లు , పరువు ప్రతిష్టలు , చదువు సంస్కారం,  అదుపులో పెడుతున్నాయి కాబట్టి  ఆడపిల్లలు మగబుద్ది నుండి రక్షణ పొంద గలుగుతున్నారు.  మగబుద్ది అడ్డూ అదుపు లేకుండా అక్కడక్కడా రెచ్చిపోతుందంటె అందుకు స్త్రీలు స్వీయ జాగ్రత్తలు పాటించక పోవడం కూడా ప్రదాన కారణమని ఎన్నో ఉదంతాలు తెలియ చేస్తున్నాయి. అలాంటిదే షాజాహాన్ పూర్ లో ఒక 12 యేండ్ల బాలిక పట్ల 73 యేండ్ల ఖాజీ "సయ్యద్" చేసిన ఘనకార్యం . దానిని క్రింది వీడియో లింక్ లో చూడండి.

                                     

 అతని పేరు "సయ్యద్ ". వయస్సు 73 యేండ్లు . చేసే పని ఖాజీ . అంటే ముస్లిం లకు మతపరంగా న్యాయమూర్తి . ఖ్యాజీ కి   పెండ్లిళ్ళు చేసి సర్టిఫికెట్ లు ఇచ్చే బాద్యత కూడా చట్టపరంగా గుర్తించబడింది.   . అయితేనేమి ఇతగాడి  ఒంటికి యేండ్లు వచ్చాయి కాని , అతనిలోని మగ బుద్దికి కొంచమైనా సిగ్గూ శరం లేవు. అతనికేదో దుకాణం  ఉన్నట్లు ఉంది. సరుకులు కోసం అచ్చిన ఒక 12 యేండ్ల అమ్మాయికి 10 రూపాయల ఆశ చూపి ఎలాంటి పాడు పని చేస్తున్నాడో చూడండి. మనవరాలి వయసు ఉన్న అమ్మాయిని ఆ విదంగా చేయటానికి అతనికి ఏ మాత్రం లజ్జా , బిడియం , మానవత్వం లేకుండా పోయాయి. అబ్లిక్ గానే ఆ నీచ కార్యం చేస్తున్న ఆ ఖాజీకి  గతం లో కూడా ఎంతో మంది ఆడవాళ్ళను లైంగికంగా వేదించిన  ఘన చరిత్ర ఉందట.

  ఈ ఖాజీ చర్యలను మొబైల్ లో రికార్డు చేయటం వలన , ఈ విషయం అమ్మాయి కుటుంభ సభ్యులకు తెలిసి , ఖాజీ మీద కేసు పెట్టడానికి వెళితే , మొదట పోలిస్ వారు ఖాజీ ఇచ్చిన డబ్బుకు ఆశపడి , అమ్మాయి తరపు వారిని తిట్టి పంపించారు అట.అంతే కాకుండా ఖాజీ కుటుంబ సబ్యులు అమ్మాయి తరపు వారిని ఉళ్ళో లేకుండా వెళ్లి పోమని బెదిరించారు అట. చివరకు అమ్మాయి బందువులు అంతా తగిన సాక్ష్యాలతో ఖాజీ మీద లిఖిత పూర్వక కంప్లైంట్ తో చర్యలకు సిద్ద పడితే , ఖాజీ అండ్ కో వారు ఊరు వదిలి పారిపోయారు అట. అదీ సంగతి.

    మైనర్ పిల్లలు ఇచ్చేఅంగీకారం చెల్లదని చట్టాలు చెపుతున్నాయి కాబట్టి  ఖాజీ కేసుకు బయపడి ఊరు వదిలి పారిపోయాడు కానీ, లేకుంటే "పిల్ల అంగీకారం తోనే సిగ్గు లేని పని చేసా " అని నిసిగ్గుగా చెప్పే వాడు అనుకుంటా?కాబట్టి అమ్మాయిలూ మగబుద్ది తీరును గమనించి జాగ్రత్తగా మెలగడం లోనే విజ్ఞత ఉంది , ఎవరో చెప్పే అవేశపు  అరువు డైలాగులు విని ,వీదుల్లోకి ప్లే కార్డులు పట్టుకుని ప్రదర్శనలు ఇచ్చినంత ఈజీగా  వాడి బుద్ది మారదు. అందుకు శతాబ్దాలు పట్టినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఇక వీడియోను చూడండి.                   


    "   "అసలు స్త్రీల పట్ల చాలా మంది మగాళ్ళు ఎందుకు  చంచల బుద్దితో  ప్రవరిస్తారు ? దీనికి పైకి చెప్పే కారణం ఒకటే . సంస్కార హీనులైన వారే అలా ప్రవర్తిస్తారు అని. కానీ ఎన్నో ఏండ్లుగా సంస్కారవంతులుగా చలామణీ అయిన వారు సహితం, స్త్రీల ఔన్నత్యాలు గురించి, పురుషుల కుసంస్కారాలు గురించి ఎడతెగని లెక్చరర్లు దంచిన వారు సహితం ఏదో ఒకనాడు హట్టాతుగా ఒక స్త్రీ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు అన్న ఆరోపణలకు గురై అందరిని విస్మయ పరుస్తాడు. స్త్రీ పురుషుల మద్య ఆరోగ్యకరమైన సంబందాలు కొనసాగింపు విషయం లో మన పూర్వీకులకు ఉన్న అవగాహనలో అరవైయ వంతు కూడా  అడునికులకు లేదు అనిపిస్తుంది. కడుపున పుట్టిన కూతురైనా సరే ,  తండ్రి తో ఒకే మంచం మీడ పడుకోవటానికి అనుమతించరు పెద్దలు. ఎందుకని? ఆ తండ్రి మీద అనుమానం కాదు,అతనిలో ఉన్న "మగ బుద్ది " ని కంట్రోల్ లో పెట్టి కుటుంభ బందాలు ఆరోగ్యకరంగా సాగేందుకు ఏర్పరచుకున్న పద్దతి. అంతే !

నేను పైన చెప్పినట్లు 10 యేండ్ల పోరగాడి దగ్గర్నుంచి , కాటికి కాలు చాపుకున్న ముసలి వారి వరకు అలాగే ఇండియాలో సుద్దులు చెప్పే ఎడిటర్ లు దగ్గర్నుంచి మెక్సికో మేయర్ ల వరకు ఎవరూ మగబుద్దికి అతీతులు కారు. ఇటువంటి మగబుద్దిని త్వరగా  పసికట్టే స్వబావం స్త్రీలకు సహజంగానే ఉంటుంది. అది భగవంతుడు ఇచ్చిన వరం. కనీసం దానిని ఉపయోగించి అయినా జాగ్రత్తపడండి . ఈ  మగబుద్ది గురించి నేను ఎన్నో సార్లు ఇదే బ్లాగులో ప్రస్తావించడం జరిగింది. వాటి గురించి వివరంగా తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉన్నవారు,"మగబుద్ది "  క్లిక్ చేసి చూడవచ్చు.

 సోర్స్:- http://www.uttarpradesh.org/trending-news-and-videos/qazi-shahjahanpur-molesting-minor-girl-uttar-pradesh-0862/

                                                   (5/5/2016 Post Republished).


Friday, 20 January 2017

, రామోజి ఫిల్మ్ సిటీ కి ఉన్న స్వేచ్చ, రామాలయానికి లేదా?

                                                                     


రామోజి ఫిల్మ్ సిటీ కి ఉన్న స్వేచ్చ, రామాలయానికి లేదా?    అంటె                                                           
 లేదని చదువు రాని పామరుడైనా డంకా బజాయించి చెపుతాడు. ఇందులో మొదటిది లౌకిక ఆనందాన్నిచ్చే వినొదాత్మక కేంద్రమయితే, రెండవది అలౌకిక ఆనందాన్నిచ్చే ఆద్యాత్మిక క్షేత్రం  .  ఈ రెండు కేంద్రాల మనుగడకు డబ్బు అవసరం అనేది ఎవరూ కాదనరు.కాని ఆ ఆర్థిక వనరుల స్వబావం మాత్రం వేరు.

  ఆద్యాత్మిక క్షేత్రాల నిర్వహణకు పూర్వ కాలంలో రాజులు, దనవంతులైన వ్యవస్తాపక కుటుంబాల వారు భూరి విరాళాలతో పాటు, మాన్యాలు ఇచ్చి పోషించే వారు. భక్తులుకు, బాటసారులకు దేవాలయాలు ఉచిత అన్న దానం, ఇతర సేవలు ఒసగేవి. కాని ఇప్పటి రోజులలో అసలు ప్రభుత్వం నుండి ఒక్క నయా పైసా కూడా తీసుకునే వీలు దేవస్తానాలకు లేదు, కారణం మనది లౌకిక రాజ్యం కాబట్టి, మత సంస్తలకు రాజ్య సొమ్మును ఖర్చుపెట్టడాని మన రాజ్యాంగం ఒప్పుకోదు. కేవలం భక్తుల దాత్రుత్వం మీదే దేవాలయాల మనుగడ నడుస్తుంది.

  ఇక పోతే పెత్తనం విషయానికి వస్తే గవర్నమెంటే పెద్ద కొడుకు. పేరుకే ట్రస్ట్ బోర్డులు. పెత్తనం మొత్తం ఎండొమెంట్ అధికారులదే. ప్రబుత్వాలను నడిపే రాజకీయ పార్టీల కను సన్నులలో మెలిగే ఎండోమెంట్ అధికారుల ద్వారా వీరు దేవాలయ వ్యవస్తను నియంత్రిస్తుంటారు. ట్రస్ట్  బోర్డులను కూడా రాజకీయ నిరుద్యోగులతో నింపి అటు అధికార్లు, ఇటు రాజకీయ పార్టీలు దేవాలయాలను సర్వనాశనం చేసారు . అసలు మత సేవలకు అర్థమే మార్చి పారేశారు.

  దేవున్ని చూడాలంటే డబ్బు ఇవ్వాలి. కొబ్బరికాయ కొట్టాలంటే డబ్బు ఇవ్వాలి.పూజ చేయించుకోవాలంటె డబ్బు ఇవ్వాలి,ఇలా ప్రతి దానికి టికెట్లు పెట్టి ఆలయాల్ని సినిమా హాళ్ళు గా మార్చిన ఘనత ఎండోమెంట్ డిపార్ట్మెంటుది. రాజకీయ నాయకులు ఎక్కడ ఉంటే అక్కడికి దేవున్నే తీసుకువెళ్ళి డర్శనం చేయించి, తీర్థ ప్రసాదాలు ఇవ్వగలిగిన ఘనులు వీరు.వీరు అమ్రతసర్ స్వర్ణ దేవాలయం ముందు భక్తుల  బూట్లు తుడిచే మంత్రుల ను చూసి సిగ్గు తెచ్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

  మత సంస్తలను వ్యాపారసంస్తలు చేసారు. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. రామోజి ఫిల్మ్ సిటీ వినోదా పరమైన వ్యాపారసంస్త. దానికి ప్రబుత్వం భూములు ఇచ్చింది. అనేక రాయితీలు ఇచ్చింది. కాని దాని మీద పెత్తనం మాత్రం చేయలేదు. పూర్తీగా ప్రైవేట్ నిర్వహణా సంస్త. అదే మత సంస్తల విషయంలో మాత్రం ఒక్క రూపాయి ఇవ్వకున్నా మొత్తం పెత్తనం ప్రభుత్వానిదే. ఎందుకంటే చేత  కాని హిందువులం ఉన్నాం కాబట్టి. మేము మత వాదులం కాదు, లౌకిక వాదులం అని గప్పాలు కొడుతూ, మత వాదులను ఈసడించే రాజకీయ పార్టీలకు అవి నడిపే ప్రబుత్వాలకు  మత సంస్తల మీద పెత్తనం కలిగి ఉండడం ఎంతవరకు సమoజసం?

  మన రాష్ట్రంలో రాజకీయ సంస్తలకు మాత్రమే స్వాతంత్ర్యం వచ్చింది. కాని అప్పట్టివరకు హిందూ మత సంస్తలకు ఉన్న స్వాతంత్ర్యం పోయింది. ఆ స్వాతంత్రం తిరిగి తెచ్చుకోవడానికి మరో పోరాటం చెయ్యాల్సిన బాద్యత ప్రతి హిందువు మీదా ఉంది. లేకుంటే దేవాలయాలు పర్యాటక  కేంద్రాలుగాను, దేవుళ్ళు అందులోని బొమ్మలుగాను మిగిలిపోతారు.       
                                                       (20/1/2016 Post Republished).

Wednesday, 18 January 2017

N.T.R. గారిని "హిందూ జీవన విదానానికి" దూరం చేసిందెవరు?

                                                                      
 
                                                         ఆంద్రుల అభిమాన  నటుడు,నాయకుడు, తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక గౌరవనీయులు నందమూరి తారక రామరావు గారు.ఆయన పక్కా హిందూ వాది. హిందూ జీవన విదానమయిన "ఆశ్రమ  జీవన విదానం" పట్ల అనురక్తి ఉంది. అందుకే తాను ఎన్నో సార్లు  "ఆశ్రమ  జీవన విదానం" లోని మూడవ ఆశ్రమమయిన వానప్రస్తం లో ఉన్నానని ఇంకా "సన్యాసం" స్తాయికి రాలేదని చెపుతూ, అసెంబ్లీ లో చొక్క ఎత్తి, తన పంచె కట్టు ని చూపించారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు ఆయన పక్కాగా  "ఆశ్రమ  జీవన విదానం" అనుసరించ దలచిన వ్యక్తి అని . కాని విది ఆడిన నాటకంలో ఆయన ఆ విదానం నుండి దూరం కాక తప్పలేదు.

  హిందువు "గ్రుహస్తాశ్రమ" దర్మాచరణాణికి మాత్రమే "వివాహం" చేసుకోవాలి. మూడు, నాలుగు ఆశ్రమాలయిన వానప్రస్తం ,సన్యాసం లలో "వివాహం" కూడదు. బార్య ఉన్నా, లేకపోయినా అమే తలపుల సహవాసం తోనే ఈ ఆశ్రమ ధర్మాలు నిర్వహించాలి.కాని అనూహ్యంగా ద్వితీయ  వివాహ మాడి , హిందూ జివన విదానానికి దూరమయ్యారు   . దీనికి కారణం ఎవరు? ఆయనకు తన స్వదర్మ నిర్వహణలో, ఆయన పిల్లలు సహకరించలేదా? లేక అయన ధర్మ నిష్టను కావాలనే ఎవరయిన భంగం చేసారా?

   ఇప్పుడు ఆయన విగ్రహాన్ని పెట్టడానికి "నేనంటే నేనని" గొడవ పడుతున్నారట! ఆయన మన మత జీవనానికి కూడ ప్రతీక. కాబట్టి ఆయన విగ్రహాని తెలుగువారు అందరి తరుపున ప్రభుత్వమే శ్రద్ద తీసుకుని పార్లమెంట్ లో విగ్రహం పెట్టించాలి అని మనవి చేస్తున్నాం. ఆయన దర్మ నిష్టలో సహకరించని ’కుటుంబ సబ్యులకు" ఆయన గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు అని మా అభిప్రాయం.

                             కోట్లు సంపాదించినవారికే, మన సమాజమ్ లో, ముసలితనం లో బద్రత లేక పోతే ఇక సామాన్యుల గతి ఏమిటి?మరింత సమాచారం కొరకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చెయ్య గలరు. http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_6635.html

                                                   (13/12/2012 Post Republished). 

Tuesday, 17 January 2017

ఖమ్మంలో "కరుణగిరి"కి 2000 ఎకరాలు ఇవ్వగల్గిన,రెడ్డిగారు, 36 ఎకరాలు "స్తంబాద్రి నరసింహుడికి" ఇవ్వలేకపోయారు!

                                                                           
ఖమ్మం లోని నరసింహా స్వామీ గుట్ట దేవాలయం 
                                                              
                                                                     ఖమ్మం! ఈ పేరు స్తంభాద్రి అనే గుట్ట వలన వచ్చిందంటారు. మన రాష్ట్రంలో ఉన్న జిల్లాలో అత్యంత చెత్యన్య వంతమైన జిల్లాగా ఖమ్మం జిల్లా కు పేరుందని మురిసి పోతుంటారు జిల్లా వాసులు. కాని అదే జిల్లాకి ముఖ్యపట్టణమైన ఖమ్మం నడి బొడ్డులో ఒక ఘోరమైన అన్యాయం "ఖమ్మం" పట్టణానికి పేరు రావడానికి కారణమైన "స్తంబాద్రి" గుట్ట మీద వెలసిన’ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయానికి  కి జరిగితే అడిగే దిక్కు లేకుండా పోయింది. కారణం బహూశా ఇక్కడంతా "ఎర్ర చైతన్యమే" తప్పా మత చైతన్యం లేక పోవడం కావచ్చు. ఏదైనా హిందూ మతానికి కాని మత సంస్తకి కాని అన్యాయం జరిగినపుడు, ఏ అర్.ఎస్. ఎస్. వాళ్ళో,బి.జె.పి వాళ్ళొ, అందోళన చెస్తే తప్పా, మతం అంటే "అంట రాని తనం" గా బావించే "ఎర్ర పార్టీల వారు పట్టించుకోరు. మరి ఖమ్మం జిల్లాలో "ఎర్ర పార్టిల" ఆదిపత్యం కాబట్టి హిందువులంతా వెర్రోల్లలాగే ఉండి పోవచ్చు.

     ఖమ్మం పట్టణంలో నడి బొడ్డున ఉన్న పురాతన పర్వతం "స్తంబాద్రి". దాని మీద కొలువై ఉన్న దేవ దేవుడు "శ్రీ లక్ష్మి నరసింహా స్వామి". దీనినే "స్తంబాద్రి గుట్ట" అని కూడ అంటారు. కొన్ని శతబ్దాలుగా ఈ క్షేత్రం హీందువులకు ఆరాద్య క్షేత్రంగా బాసిల్లుతుంది. ఈ గుట్ట యొక్క విశాల్యం సుమారు 40 ఎకరాలు లోపు ఉంటుంది. ఇది పర్వత మయం కావడం వలన అటు వ్యసాయానికి కాని, ఇటు నివాస యోగ్యం కాని కాదు. కాని ఆ దేవ దేవుడు వెలసిన ప్రాంతం కావడం వల్ల ఒక పవిత్ర క్షేత్రమయింది. గవర్నమెంట్ రికార్డుల ప్రకరం ఇది సర్కారీ వారి బూమి గా నమోదై ఉన్నట్లు తెలుస్తుంది. ఈ పర్వతాన్ని అధికారికంగా దేవాలయానికి ఇవ్వవలసిందిగా కోరినప్పటికి ప్రబుత్వం సాచేత దోరణి అవలంబిస్తూ వచ్చింది. ఎండోమెంట్ వారు కూడా రాజకీయ జ్యోక్యం వల్లా ఏమి చెయ్యలేక మిన్న కున్నారు.

  ఇదే ఖమ్మం పట్టణానికి పడమర వైపు,మున్నేరు వాగు వొడ్డున సుమారు రెండు వేల ఎకరాల సుసంపన్నమైన స్తలం ఉంది. ఇది పట్టణానికి ప్రక్కనే ఉండడం వలన ప్రస్తుతం దాని రేటు ఎకరకి కోటి రూపాయల పైనే ఉండవచ్చు.ఇట్టి స్తల్లాన్ని ౨౦౦౭ లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేకర రెడ్డి గారు తనకున్న మతాభిమానంతో నామమాత్రపు రేటుతో "కరుణగిరి" కి కట్ట బెట్టారు. మతాలన్నింటిని సమానంగా చూస్తామనే "లౌకిక రాజ్య" ముసుగులో ఒక మత వాది చేసిన అన్యాయంగా దీని చెప్ప వచ్చు. ఒక వేళా మతాలన్ని సమానమని బావిస్తే వారి, వారి జనాబా నిష్పత్తులానుసారం ఒకే రేటుకి ఆ భూమిని ఇస్తే అది ధర్మమఈన పని గా బావించ వచ్చు. ఈరోజు ఖమ్మలో ఏ దార్మిక సంస్త స్తాపించాలన్నా హిందువులకు బూమి లేని పరిస్తితి.ఒక వేళా లౌకిక అవసరాకు అయినా సరే ఒక సెంటు భూమి ప్రబుత్వానిది లేకుండా పోయింది.

    నేను ఇంతకు ముందు టపాలో చెప్పినట్లు, మా తాతలు, తండ్రులు  దేవాలయాలకు ఇచ్చిన భూములు ఎండోమెంట్ వారి పుణ్యమా అని పరుల ఆదీనంలోకి వెళ్ళి పోయాయి. ఏదైనా ప్రభుత్వ భూమి ఉందా అంటే, అది కరుణామయులైన ప్రభుత్వ పెద్దల కరుణకు కరిగిపోయింది. ఇక బవిశ్యత్తులో హిందువు అనే వాడు ఏ ధార్మిక సంస్త స్తాపించ లేడు. కారణం కోట్ల రూపాయలు భూమి కొనుగోలుకే సరిపోతుంది. ఇది బహూశా ఖమ్మంలోని హిందువులకే కదు, రాష్ట్రం లోని హిందువులందరిది ఇదే పరిస్తితి కావచ్చు.
       అందుకే హిందూ దాతలారా, మీరు మీ బూములు ఏమైనా దేవాలయలకు కాని, దార్మిక సంస్తలకు కాని దానం చేసి వాటి మీద  ప్రబుత్వానికి అధికారాలు కల్పించకండి. మీ అదీనంలొనో, అది వీలు కాని పక్షంలో, ఒక స్వయం ప్రతిపత్తి విదానం ఉన్న ట్రస్టుకో అప్ప చెప్పండి. ప్రబుత్వ భూములలో కూడా మన జనాభా నిష్పత్తి ననుసరించి హిందూ ధార్మిక సంస్తలకు భ్హూ కేటాయింపు జరగాలి. లేకుంటే దేవాలయాలు కూడా అపార్ట్మెంట్లో స్తాపించే దుర్దశ మనకు పడుతుంది. 

     నోటు:- ఈ "కరుణగిరి" వ్యవస్తాపక డైరెక్టర్ లో ఒకరు ప్రస్సిది గాంచిన "అగస్టా హెలికాప్టర్" కుంభకోణంలో ముక్య సూత్రదారి. ఈ కరుణ గిరి వెనుక  పెద్ద కుట్ర ఉందని అనుమానం కావాలంటే ఈ లింక్ మీద క్లిక్ చేసి మరింత సమాచరం తెలిసికోవచ్చు. http://www.dailymail.co.uk/indiahome/indianews/article-2280665/YSR-family-comes-helicopter-cloud.html  

                                               (18/5/2013 Post Republished).