ఎన్నో వేల పెటిషన్ లు పరిష్కరించిన ఆ హై కోర్టు జడ్జ్ గారికి తన స్వంత కూతురు విషయంలో పిటిషన్ వేసుకోలేని నిర్బాగ్యుడయ్యడు !. ఎందుకని ?

                                                             


                                    మనది భారత దేశం. ఇక్కడ అనేక మతాలకు చెందిన వారు కలసి మెలసి జీవిస్తున్నారు. ప్రపంచ దేశాలలో భారతీయ కుటుంభ వ్యవస్తకు ఒక విశిష్ట స్తానం ఉంది. ఎన్నో వేల సంవత్సరాలుగా పటిష్టమైన కుటుంబ జీవన విదానం తో బారతీయ సమాజం అలరారుతూ ఉంది. స్వాతంత్ర్యం వచ్చాకా , భారత రాజ్యాంగం సైతం పౌరులకు మత  స్వేచ్చను ప్రసాదించింది . మత  పరమైన హక్కుల విషయం లో ప్రభుత్వాలు  జ్యోక్యం చేసుకుంటే కోర్టులు తగిన ఆర్డర్లు ద్వారా వాటిని నిరోదించి , మత  హక్కులను రక్షిస్తాయి అంటే కారణం మత  స్వేచ్చ మన ప్రాదమిక హక్కులో బాగంగా ఉండడమే. కానీ ఇదే మత  స్వేచ్చను కొన్ని చట్టాలు ఉల్లంఘిస్తుంటే వాటిని ప్రశ్నించే స్తితిలో హిందువులు లేక పోవడం ఖచ్చితంగా మన దౌర్బాగ్యమే అని చెప్పవచ్చు.

   హిందువుల మత విశ్వాసాలలో ప్రదానమైన వాటిలో  హిందూ వివాహాలు కూడా ఒకటి . తన కుమార్తెను సద్గుణ వంతుడు అయిన బ్రహ్మ చారి కి ఇచ్చి వివాహం చేస్తే తనకు ఎంతో పుణ్యం వస్తుందని హిందూ అయిన తండ్రి నమ్మక్కం. ఇక మాములుగా అయితే తన కుమార్తె సుఖ సంతోషాలను ద్రుష్టిలో ఉంచుకుని వరుడి యొక్క  కుటుంభ చరిత్రను, కూలం కషంగా  పరిశిలించాకే  వారి వివాహానికి అనుమతి తెలపటం జరుగుతుంది. హిందూ వివాహాలలో పూర్వం 8 రకాలు ఉన్నప్పటికి అందులో  ఇరువైపులా తల్లితండ్రుల అనుమతితో జరిపే "ప్రజా పతి  వివాహమే" శ్రేష్టమైనదిగా బావించి దానినే ప్రామాణికంకా అనుసరిస్తునారు . కానీ దురద్రుష్టవశాత్తు హిందూ మారేజ్ ఆక్ట్ లో హిందువుల మద్య జరిగే వివాహానికి తల్లి తండ్రుల అనుమతి కంపల్సరి చెయ్యక పోవడం వలన హిందూ వివాహం కి , ఇండియన్ వివాహం  కి తేడా లేకుండా పోయింది.

   కేవలం వయో ప్రాతిపదికన తనకు నచ్చిన వారిని వివాహం చేసుకోవడాన్ని ఇండియన్ మారేజ్ ఆక్ట్ అనుమతిస్తుంది. వదూ వరులు కుల, మతాలకు అతీతంగా తనకు నచ్చిన వారిని  18 ,21 యేండ్ల ఈడు వస్తే చాలు వివాహం చేసుకోవచ్చు. కానీ హిందూ మారేజ్ ఆక్ట్ ప్రకారం ఖచ్చితంగా వడూ వరులు , హిందువులై ఉండాలి అని నిబందన ఉంది కానీ ముఖ్యమైన తంతు "కన్యా దానం " . దీనిని మాత్రం చట్టం గుర్తించలేదు. తల్లితండ్రులు కానీ, వారు లేని పక్షంలో ఆ వరుస అయిన వారు మంత్ర సహితంగా కన్యా దానం చేసి పుణ్యం పొందుతారు అని నమ్మక్కం. ఆ ఒక్క నిబందన ఉండి ఉంటే ఈ  నాడు ఎంతో మంది తల్లి తండ్రులకు పుణ్యం మాట ఎలా ఉన్నా, కనీసం తమ ఆడపిల్లల జీవితాలను కాపాడుకునే అవకాశం ఉండి ఉండేది. అది లేదు కాబట్టే ప్రేమ పేరుతో, వెర్రి మొర్రి ఆకర్షణలలో జీవితాలను నాశనం చేసుకుంటున్న బిడ్డలను చూస్తూ కండ్లలో నీరు కుక్కుకోవడం తప్పా తమ బాదను ఎవరికీ చెప్పుకోలేని నిస్సహాయ పరిస్తితిలో ఉండి ఫొతున్నారు.

  ఉదాహరణకు మొన్నీ మద్య జరిగిన ఉదంతం . అయన గారు రాజస్తాన్ హై  కోర్టు జడ్జ్ గారు . అయన గారి కుమార్తె ఎవరో అబ్బాయిని ప్రేమించింది. దానికి అయన గారు అంగీకరించ లేదు. తన కూతురుకు చెప్పిన్నప్పటికి వయస్సు తెచ్చే మాయా మోహం లో ఆ అమ్మాయి వినిపించుకోవడం లేదు. ఇంతలో ఆ ప్రేమికుడు సుప్రీం కోర్టుకు ఒక పిటిషన్ పెట్టి, తన ప్రేమికురాలిని తనకు అప్ప చెప్పమంటే , ఇన్నాళ్ళు పెంచిన తల్లి తండ్రుల గోడు వినిపించు కోకుండా ఆ అమ్మాయిని తీసుకు వెళ్లి ప్రియుడికి అప్పచేప్పమని సుప్రీం కోర్టు పోలీసులను ఆదేశించింది అంట  . ఇదీ మన దేశంలో తల్లి తండ్రుల దౌర్బాగ్యం . ఎన్నో వేలమంది సమస్యలను విని వారికి పరిష్కారం చూపిన జడ్జ్ గారు , కూతురు విషయం లో  ఆమె ప్రియుడు కు ఉన్నపెటిషన్ వేసుకునే హక్కు కూడా , తనకు లేక పోవడం తో దిక్కు లేని వాడుగా కండ్ల నిరు కుక్కుకుంటూ ఉంది పోవాల్సి వచ్చింది . ఎందుకని? హిందూ వివాహ చట్టం ప్రియుళ్ళు కు ఇచ్చిన హక్కు లను తల్లితండ్రులకు ఇవ్వకపోవడమే. మరి  ఇలా అమాయకపు ఆడపిల్లలు  ప్రేమ  వ్యామోహం లో పడి ముందు వెనుక కానక, జీవితాలను నాశనం చేసుకుంటుంటే , కనీసం తల్లి తండ్ర్లు తమ బాధలను చెప్పుకునే అవకాశం ఇవ్వక పోవడం ఘోరాతి ఘోరం.

  ఇదే విషయమై ఇంతకు మునుపు నేను పెట్టిన టపాలో కొంత  చర్చ జరిగింది. నా  అభిప్రాయాన్ని ఆదునిక బావజాలాలు ఒప్పుకోక పోవచ్చు. కానీ అవేవి ఆడబిడ్డల బ్రతుకులుకు గ్యారంటీ ఇవ్వవు.మహా అయితే చస్తే నాలుగు కొవ్వోతులు వెలిగించి , సంతాపాలు తెలియచేయటానికి పనికొచ్చే బావాజాలలు కాదు ఆడపిల్లల్ని రక్షించేది. కచ్చితంగా పటిష్టమైన కుటుంభ వ్యవస్తే ఆడబిడ్డకు శ్రీ రామ రక్ష. మరింత సమాచారం కొరకు ఈ  క్రింది లింక్ ను క్లిక్ చేసి చూడండి .                                                            "తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన"http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_14.html

                                        (Republished Post. 17/12/2013)

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన