తమ కొడుకు 'షార్ట్ ఫిలిమ్స్ హాట్ హీరోయిన్ ' వలలో చిక్కుకున్నాడని విలవిలలాడుతున్న పోలీస్ ప్యామిలీ !!.

                                                                     



                               ఆ అబ్బాయి పేరు ప్రసన్న కుమార్ . ఇంజనీరింగ్ స్టూడెంట్ . ఊరు తూర్పుగోదావరి జిల్లాలోని సామర్ల కోట . ప్రసన్నకుమార్ తండ్రి గారు మంచి స్థాయిలో ఉన్న పోలీస్ అధికారి . తమ కుమారుడు మంచి ఇంజనిర్ అయి కుటుంబాన్ని ఉద్దరిస్తాడు అని కాలేజీకి పంపితే , ఇంజనీరింగ్ చదువు ఏమైపోయిందో కానీ , మంచిగా యూ ట్యూబ్ లో వచ్చే రొమాంటిక్ సీన్లు చూస్తూ కాలేజీ లైఫ్ ఎంజాయి చేసినట్లు ఉంది . అలా ఎంజాయి చేయడమే కాదు , అలా యూట్యూబ్  షార్ట్ ఫిలిం లో నటిస్తూ  హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న "సిరిప్రియ " అనే నటి తో ఫేస్ బుక్ పరిచయం కూడా పెంచుకున్నాడు ఆట .

   సాధారణంగా ఇంజనీరింగ్ స్టూడెంట్ అంటే 16 లేక 17 ఏండ్లకి  ఇంటర్ పూర్తి చేసుకుని ఇంజనీరింగ్ ఫస్టియర్ లో జాబు అవుతారు . వారికి చట్టప్రకారం పెండ్లి ఈడూ వచ్చే సరికి అంటే 21 సంవత్సరానికి కానీ ఇంజనీరింగ్ పూర్తి కాదు . మరి పై ఉదంతం లో తెలుపబడిన ప్రసన్న కుమార్ , సిరిప్రియ ల మధ్య ప్రేమ వ్యవహారం గత 6 ఏండ్లుగా నడుస్తోందని చెపుతున్నారు. ఇదే నిజమైతే ప్రసన్నకుమార్ కి పెండ్లి వయసు రాక ముందే ప్రేమ ముగ్గులోకి దించబడ్డాడు అని అర్థం అవుతుంది. ఫోటోలలో , వీడియోలో చూస్తుంటే సిరిప్రియ ప్రసన్న కుమార్ కంటే పెద్దదిగా కనిపిస్తుంది . అయినా ప్రేమ గుడ్డిది కాబట్టి ప్రేమికుల మధ్య వయస్సు తారతమ్యాలు అది పట్టించుకోదు .

బహుశా ప్రసన్న కుమార్ తండ్రి గారు పోలీస్ ఆపీసర్ కాబట్టి , 21 ఏండ్లు నిండనిదే ప్రసన్నకుమార్ ని వివాహమాడితే చట్టం ఒప్పుకోదు కాబట్టి , చట్టవ్యతిరేకమైన పని చేస్తే పోలీస్ ఆపీసర్ గారు ఒప్పుకోరు కాబట్టి , ప్రసన్న కుమార్ కి 21 ఏండ్లు వచ్చే దాకా చూసి , అవి రాగానే గబుకున్న చర్చ్ లోకి వెళ్ళి పెండ్లి చేసుకున్నారు కాబోలు  . దానితో ప్రసన్న కుమార్ ప్యామిలీ నివ్వెరబోయి,  తమ కొడుకు ఒక షార్ట్ ఫిలిమ్స్ హాట్ హీరోయిన్ చేతిలో ఇరుక్కుపోయాడే అని విల విల లాడి పోయారు ఆట .కొందరికి తమ పిల్లల పెండ్లి విషయాల్లో కొన్ని నిశ్చిత  అభిప్రాయాలు ఉంటాయి . యాక్టింగ్  ప్రొపెషన్ లో పని చేసే వారిని అందరూ అంగీకరించరు . అంతెందుకు పేరొందిన నటులే తమ కుమార్తెలను సినిమా రంగానికి పరిచయం చేయడానికి అంగీకరించలేదు  . ఎందుకంటే ఆ నటనా రంగం లో స్త్రీలకు ఎదురయ్యే ఇబ్బందులు ఏవో వారికి పూర్తిగా తెలుసును కనుక . బహుశా ఆ ఉద్దేశ్యం తోనే  వారి పెండ్లిని  ప్రసన్న కుమార్ తల్లి తండ్రులు అంగీకరించ లేదు కాబోలు .

   ఇక తమ పెండ్లికి ప్రసన్న కుమార్ తల్లి తండ్రులు చెప్పే కారణం విని సిరిప్రియ బహు బాధ పడి  పోయింది . రొమాంటిక్ సీన్ లో నటించినంత మాత్రానా చెడిపోయినట్టేనా అని మీడియా సాక్షిగా ప్రశించడం మొదలు పెట్టింది. నిజమేగా మరి! సీత పాత్రలో నటించిన వాళంతా   నిజజీవితం లో సీత లుగా ఉండాలని రూలేలా ఉండదో , రొమాంటిక్ సీన్లు లో నటించే వారికి నిజజీవితం లో హాట్ గా ఉంటారనే  రూలు లేదు. కాకపొతే వచ్చిన చిక్కేమిటంటే సిరి ప్రియ కి సపోర్ట్ గా ఆమె తప్పా , ఆమె ప్యామిలీ మెంబర్స్ ఎవరూ కనిపించడం లేదు. పై పెచ్చు ప్రసన్నకుమార్ ఏమో "జర్నీ" సినిమాలో హీరోయిన్ అంజలి ఇంఫ్లూయెన్న్స్ లో ఉన్న నోట్లో వేలేసుకుని నేల చూపులు   చూసే  హీరో లాగా అమాయకంగా ఉన్నాడు. ఇటు సిరిప్రియ ఏమో ఫుల్ కమాండ్ తో పోలీస్ స్టేషన్ కి వెళ్లి తమకు  ప్రసన్నకుమార్ బంధువులతో ప్రాణభయం ఉంది కాబట్టి తమకు రక్షణ కల్పించాలని డిమాండు చేస్తోంది. ప్రసన్నకుమార్ పేరేంట్స్డ్  ఏమో తమ కొడుకును చట్ట ప్రకారం ఎలా రక్షించుకోవాలో తెలియక  "ఇక నీకు మాకు సంబంధం లేదు పో" అని J.V సోమయాజులు గారి డైలాగులు మాదిరి ఒక మాట అనేసి లోలోపల విల విల లాడుతున్నారు .

                                                                     

                     
                                  అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే , ఎవరైనా తల్లితండ్రులు తమ పిల్లలకు పెండ్లి చేయాలంటే , ఆడపిల్ల అయితే 18 ఏండ్లు వచ్చేదాకా , మగపిల్లాడు అయితే 21 సంవత్సరం వచ్చే దాకా ఆగాలి. ఒక వేళా తమ పిల్లలు ఇలా ప్రేమ పేరుతో తమ జీవితాలు నాశనం చేసుకుంటారేమో అనుకుని పెండ్లి ఈడూ రాకముందే వారికి సంబంధాలు నిర్ణయించి ,ఎంగేజిమెంట్ అవి కానిచ్చి అందరికి వారే భార్యా భర్తలు అని తెలిసేలా చేసి , చట్టప్రకారం,  వయసు రాగానే పెండ్లి చేస్తే ఎలా ఉంటుంది? చూసారా చిన్నతనం లోనే పిల్లలకు సంబంధాలు నిర్ణయించి , టెక్నీకల్ గా పెండ్లి చేసి వారి జీవితాలు నాశనం చేశారు అని అనరా ? మరి ఇదే మాట  మైనర్లుగా ఉన్నప్పుడే ప్రేమించుకోవడం మొదలు పెట్టి , చట్ట నిర్దేశిత వయసు రాగానే టక్కున పెండ్లిళ్లు చేసుకునే వారికి వర్తించదా ? నిర్ణిత వయసు రాకుండా వివాహం చేసుకోవద్దు అంటే , ఆ వయసు వచ్చేదాకా  దాకా ప్రేమించుకుని అన్ని వ్యవహారాలు చక్కపెట్టుకోని , గడువు తీరిన మరునాడే మ్యారేజ్ చేసుకోవడం  అని అర్థమా? ఇదేగా నేటి మైనర్ ప్రేమికులు , వారిని సపోర్ట్ చేస్తున్న వారు అర్ధం చేసుకుంది?

       మొన్నటి శ్రీజ  నుండి నేటి సిరిప్రియ కేసు వరకు ఇదే తంతు. మైనర్ లుగా మానసిక పరిపక్వత రాక ముందే ప్రేమలో పడడం, ఏండ్లు ఏండ్లు కలసి తిరిగి కెరీర్ నాశనం చేసుకోవడం , చట్ట వయసు రాగానే పెండ్లి చేసుకుని అటు పెద్దలను , ఇటు పెద్దలను బాధపెట్టి తామేదో ఘనకార్యం చేసినట్లు ఫీల్ అవ్వడం , కొన్నాలు కాపురం చేయగానే ఆకర్షణ మాయమై ఆక్రోశించడం , పంచాయితీలు ,విడాకులు లాంటి ప్రహసనాలు . ఇది కొంతమందికి ప్యాషన్ అయిపోయింది .  20 ఏండ్లు పెంచిన వారి ప్రేమ, ఫేస్బుక్ ప్రేమల ముందు ఎందుకు కొరగాకుండా పోతుంది అంటే అందుకు కారణం ఫేస్బుక్ ప్రేమలకు ఉన్న చట్ట పరమైన గుర్తింపు , నేచురల్ ప్రేమకు లేకపోవడమే .

        మనదేశం లో వివాహ వయో పరిమితిని స్త్రీలకు 22 ఏండ్లు గాను , పురుషులకు 25 ఏండ్లుగాను చేసి , ఈ  లోపులో వివాహం చేసుకోవాలి అంటే తల్లి తండ్రుల అనుమతితో చేసుకోవచ్చు అని చట్ట సవరణలు చేస్తే చాలా వరకు ఈ  ఫేస్బుక్  ప్రేమ పెండ్లిళ్లు లాంటి మోహపు వికారాలు కు తద్వారా కలిగే అనర్థాలకు అడ్డుకట్ట వేయొచ్చు. ఒక శాస్త్రీయ అధ్యయనం ప్రకారం పైన తెలిపిన వయసు వచ్చేసరికి స్త్రీ పురుషులు పూర్తి మానసిక  పరిణతి పొంది తమ భవిష్యత్ పట్ల ఒక స్పష్టమైన అవగాహన కలిగి  ఉంటారట. లేదూ ఆ లోపే పెండ్లిళ్లు చేసుకునే వారికి కుటుంబ రక్షణ ఎలాగూ ఉంటుంది కాబట్టి , వారి భవిష్యత్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

  కాబట్టి , ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన అంశమైనా , పెండ్లి అనేది మాత్రం రెండు కుటుంబాలకు సంబంధించిన అంశం అని మన సమాజము ఏనాడో గుర్తించింది . కానీ చట్ట సభలే   దానికి తూట్లు పొడిచి , ముందు వెనుకా చూసుకోకుండా వివాహ చట్టాలకు సవరణలు చేస్తే , చివరకు ప్రేమించుకున్నోళ్ళు హీరో హీరోయిన్ లు అయిపోయారు, కనిపెంచినోళ్లు విలన్ లు అయి పోయారు .

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన