ఆలుమగలు అంటే తనువుల పరంగా కాదు , మనసుల పరంగా అని చాటి చెపుతున్న సీతారామ కళ్యాణం !!!

                                                                     

.                          
                       భారత దేశంలో కుటుంబ వ్యవస్థ ఉన్నంత వరకు , ఆలు మగల మద్య అన్యోన్యత ఉన్నంత వరకు సీతా రాముల ఆదర్శ దాంపత్యం గురించి జనులు చెప్పుకుంటూనే ఉంటు0టారు . హైందవ సంప్రాదాయంలో ఆలుమగలు ను విడి విడి గా చూడటం జరుగదు . హిందువులు జరిపే, గృహలలో పూజలు  మొదలుకుని , దేవాలయాలలో మరియు  ఇతర సామూహిక పూజల  వరకు తప్పకుండా దంపతులు పాల్గోనవలసిందే . ఒక వేళా  తన జీవిత బాగస్వామి రాలేని లేక లేని పరిస్తితులలో కూడా వారు ఉన్నట్లుగానే బావించి పూజలు జరపుతారు . అంతే  కాని వివాహం కాని వారికి క్రతువులు జరిపించే అధికారమే లేదు . ఇదే విషయం మనకు రామాయణం లో "స్వర్ణ సీత" ఉదంతంలో తెలుస్తుంది .

                                   రాములవారు ప్రజల మాటకు విలువిచ్చి , కట్టుకున్న ఇల్లాలిని అడవిలో వదలి రమ్మని తమ్ముడిని ఆజ్ఞాపిస్తాడు . ఆ రోజు నుంచి ఇక్కడ రాజ ప్రాసాదంలో రాములువారు , అక్కడ అడవిలో సితమ్మ వారికి నిరంతరం ఒకరి మిద ఒకరికి ద్యాస . తమ జీవిత బాగస్వాములనే తలచుకుంటూ మానవులుగా తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తుoటా రు . రాముల వారికి ఒక సందర్బంలో యజ్ఞం చేయాల్సి వస్తుంది  . అందుకు సహధర్మ చారిణి లేనందువలన యజ్ఞం ఎలా నిర్వహించాలి అని మదనపడుతుoటే, పండితులు, మనిషి దగ్గర లేనప్పుడు  ఆమె ప్రతిమను చెంత నుంచుకుని యజ్ఞం చేయవచ్చు అంటారు . దానితో రాములవారు బంగారంతో సీతమ్మ వారి ప్రతిమను చేయించి యజ్ఞం పూర్తీ చేస్తాడు . రాములు వారు యజ్ఞం చేస్తున్నారని తెలిసి , భార్య లేకుండా యజ్ఞం సాద్యం కాదు కాబట్టి , రాములు వారు వేరే వివాహ మాడాడేమో అని ఆయన్ని కాసేపు అనుమానిస్తుంది .దానికి వాల్మికి మహర్షి ఆమెకు వాస్తవం చెప్పి, సీతమ్మ మనసులో   ఉన్న రాముని స్తాన్నాన్ని మరింత పటిష్టం చేస్తాడు .

                      చూసారా , ప్రజా పాలనే కాదు సంసారం కూడా   ఎంత ధర్మ బద్దంగా చేయాలో అ దంపతుల చరిత్ర ను చూస్తె తెలుస్తుంది . ఒక అల్పుడు మాట అయినా అది ప్రజా వాక్కు గా బావించి , భార్యా భర్తలు ఒకరి పట్ల ఒకరు ఏంతో ప్రేమానురాగాలు, నమ్మకం ఉన్నప్పటికీ విడి విడిగా జీవిస్తూనే ప్రేమానురాగ జీవితాన్ని పొందారు . ఆలుమగలు అంటే తనువుల పరంగా కాదు , మనసుల పరంగా కలసి ఉండడం అని మానవ లోకానికి చాటిన సీతారాముల దాంపత్యం యుగయుగాలకు ఆదర్శ ప్రాయమ్.భార్యా భర్తలు ది జన్మ జన్మ ల బందం అంది ఇలాంటి ఆదర్శ బందం గురించి తప్పా , 50 ఏండ్లు కాపురం చేసినా ఒకరి కోసం ఎలా బ్రతకాలో తెలియని నిర్బాగ్య దంపతులు గురించి కాదు . ఏది ఏమైనా అందరికి అ సీతారాముల వారి సంపూర్ణ ఆశిస్సులు కలగాలని కోరుకుంటున్నాను .

                    వీక్షకులు , మిత్రులు , అగ్రేగ్రేటర్లు అందరికి శ్రీరామ నవమి శుభా కాంక్షలతో .....

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన