Posts

Showing posts from August, 2017

దేవుడికి దగ్గరవుతారని చెప్పి,400 మంది శిష్యుల వ్రుషణాలను కోయించి వేసిన "వృషభ గురువు"!!!

Image
                       అతడొక గురువు. కాని అందరికి మల్లె అట్టాంటి ఇట్టాంటి మామూలు గురువు కాదు .ప్రపంచ వ్యాప్తంగా 50 మిలియన్ ల మంది అనుచరులు  ఉన్న "చార్మిషింగ్ గురు". అతడే "డేరా సచ్చా సౌదా "అనే మత సంస్త వ్యవస్తాపకుడు " గుర్మీత్ రాం రహీం సింగ్ ". ఇతడు  సిక్కు మతానికి వ్యతిరేకంగా అందరూ ఒకటే అనే కాన్సెప్ట్ తో మూడు మతాలకు సంబందించిన  పేరుతో ఉద్బవించిన ఒక సంచలన గురువు . పాలోయ ర్స్ సంఖ్యను  ను  బట్టి , గురువుల గొప్ప తన్నాన్ని నిర్ణయించాల్సి ఉంటే మాత్రం ఇతడు గొప్ప గురువే .కాని గురు భోదలు అనుసారం "గురు " పరిక్ష జరిపితే మాత్రం ఇతడు ఒక తిక్కల గురువు లేదా మానసిక సమస్యతో బాదపడుతున్న గురువు అని అనక తప్పదు .దానికి కారణం 2000 వ సంవత్సరం లో  అతడు చేసిన  ఒక "మహా పాప కార్యం ". అదేమిటో చూదాం .                                                                                 గుర్మిత్ రామ్ రహీం సింగ్ చేసే బోదలలో ప్రదానమైనది "దేవుడికి దగ్గర కావటం ఎలా "? .దీని కోసం అతడు సూచించిన మార్గం పురుషులు తమ వ్రుషణాలను ఆపరేషన్ ద్వారా తొలగించుకోవాలి

గణపతి పూజ నుండి ఘనపతి పూజ వరకు

Image
ఓ బొజ్జ గణపయ్య! నీ బంటు నేనయ్యా!           మా చిన్నతనంలో వినాయక చవితి వస్తుందంటే పిల్లల్లం మేము చాలా సంబరపడే వాళ్లం.నేను మా చెల్లెలు ఇద్దరంకలిసి పొద్దున్నే మా ఇంటి ఎదురుగా కొద్ది దూరంలో  ఉన్న ఎర్ర చెరువు కి వెళ్లి, అందులోనుంచి,చెరువు మట్టి ని తీసుకు వచ్చే వాళ్ల్లం. ఆ తర్వాత మా అమ్మ గారి సూచనలతో ఇద్దరం కలిసి గణపతి బొమ్మను తయారు చేసేవాళ్లం.అలాగే మా ఇంటి చుట్టు (మా ఇల్లు వూరికి దూరంగ మా చేలో ఉంది)ఉన్న రక రకాల పత్రి సేకరించే వాళ్లం.వాటిలో జిల్లేడు,దెవదారు,తంగేడు,సీతాపలం,వెలగ,రేగు,గన్నేరు ,ఉమ్మేత్త,మారేడు ,దానిమ్మ,మొదలైనవి ఉండేవి. ఆ తర్వాత మా అమ్మ గారు రక రకాల పిండి వంటలు ముక్యంగా వినాయకుడికి (మాకు కూడ)  ఇష్టమైన కుడుములు చేసి పూజకి అంతా సిద్దంచేసి ఉంచేవారు. మా నాన్న గారు పూజమంధిరంలో పటాలకు పూజ చేసి, మేము చేసిన గణపతిని ప్రతిష్తించి పూజ చేసేవారు.మేము పిల్లలం మా పుస్తకాల పైన  "శ్రీ " అని పసుపుతో రాసి పూజ దగ్గర పెట్టేవళ్లం. అలాగే మా నాన్న గారు మా వ్యాపార సంబందమైన పుస్తకాలను పెట్టె వారు. మా వ్యవసాయ పనిముట్లు అన్నిటి పైన కొంత పత్రిని ఉంచి పసుపు కుంకమతో బొట్లు పెట్టేవాళ్లమ్.      

డేటింగ్ లు చేసి మొగుళ్ళని ఎంపిక చేసుకుందాం అనే ఇండియన్ గర్ల్స్ కి చీటింగ్ కేసులే గతి!!?

Image
                                                                                                                                               ఒక పక్క ఆడ పిల్లల్లు, అమాయకంగా ఇండియా లో ప్రాశ్చ్చాత్య సంస్క్రుతి వచ్చిందని భ్రమపడి, మగవాళ్ళను నమ్మి  భయటకు వెళ్ళి దారుణంగా భంగ పడుతున్నారు. ఆ క్రమంలో మానం సంగతి సరే సరి కాని ప్రాణాలు కూడ దక్కేట్లు లేవు. పోని వీరి డేటింగ్ కార్య కలపాలకి ప్రబుత్వాలని రక్షణ అడుగుదామా అంటే, డేటింగ్ ని చట్ట బద్దం చేయరాయే! ఇప్పటికే "ఎయిడ్స్" ని ఎలా అరికట్టాల్రా నాయనా అని ప్రభుత్వాలు నిరోదులు పట్టుకుని తిరుగుతూ ప్రజల్ని బతిమాలుతున్నాయి. ఎందుకంటే మనది ప్రజాస్వామ్యం కదా! జ్ణానం కంటే ముందు వయసు వచ్చింది. దానికంటే ముందు కోరికలు గుర్రాలయినవి. ఆ గుర్రాలకు సాంప్రదయవాదులు పగ్గాలు వెయ్యాలని చూస్తుంటే "స్త్రీ వాదులు" పగ్గాలు వెయ్యడం దారుణం స్వేచ్చగా జూలు పట్టుకుని స్వారి చెయ్య మంటున్నారు. గుర్రాల్ని అదుపు ఎలా చెయ్యాలో తెలియని యువత స్వారి చేస్తే ఎమవుతుంది. ఇప్పుడు జరుగుతుందదే. ఈ సమాజం లోని నైతిక విలువలు నాశనం కావడం  విదేశి వ్యాపార వర్గాలకు అత్యవసరం. వా

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

Image
                                                                      Courtesy :From  Bapu Cartoons  మన పూర్వికులు చెప్పిన నీతి శాస్త్రాను సారం ఉత్తములైన భార్యా భర్తల  లక్షణాలు  క్రింది విదంగా ఉంటాయి . (1) శ్లో॥    కార్యేషు యోగీ, కరణేషు దక్షః          రూపేచ కృష్ణః క్షమయా తు రామః          భోజ్యేషు తృప్తః  సుఖదుఃఖ మిత్రం          షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః (ఉత్తమ భర్త  లక్షణాలు ) కార్యేషు యోగీ : పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి.   కరణేషు దక్షః  కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో  నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.  రూపేచ కృష్ణః రూపంలో కృష్ణుని వలె ఉండాలి.  క్షమయా తు రామః ఓర్పులో రామునిలాగా ఉండాలి.   భోజ్యేషు తృప్తః భార్య వండినదాన్ని సంతృప్తిగా  భుజించాలి.   సుఖదుఃఖ మిత్రం  సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి. ఈ  ఈ ఆరు పనులు సక్రమంగా చేసే  పురుషుడు ఉత్తమ భర్త  కొనియాడబడతాడు. (2). శ్లో॥    కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ,          రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ,